రైతులకు గుడ్ న్యూస్.. 27న ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ: కేంద్రం
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడులకు డబ్బులు అందిస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వం కూడా తక్కువ మొత్తంలోనైనా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు ఇస్తున్నది.
కేసీఆర్ పైసలు, మోడీ పైసలు అని సాధారణ ప్రజలు వీటిని గురించి మాట్లాడుకుంటారు. పీఎం కిసాన్ కింద డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన రైతులకు అందించనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి మూడు విడతలుగా రూ. 2000 చొప్పున మొత్తం ఏడాదికి రూ. 6000లను ఈ పీఎం కిసాన్ యోజన కింద రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ఇది వరకు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 13 విడతలుగా డబ్బులను రైతులకు వారి ఖాతాల్లో వేసింది. తాజాగా, 14వ విడత డబ్బులనూ 27వ తేదీన వేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన రాజస్తాన్‌లోని సికార్‌లో కార్యక్రమం ఈ నిధులను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
పీఎం కిసాన్ పథకం యేటా రూ. 6000 చొప్పున జమ చేస్తున్నారు. రైతులకు ఈ పథకం కింద రూ. 8.5 కోట్ల మంది లబ్ది చేకూరుతున్నదని అధికారులు పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment