ఇప్పట్లో ప్రతి ఇంట్లో ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ టీవీ, స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ళలో వైఫై తప్పనిసరిగా ఉంటోంది.
అయితే వైఫై ఆన్ లోనే ఉంటే ఏమవుతుందనే కారణంతో చాలా మంది రాత్రిళ్ళు వైఫై ఆఫ్ చెయ్యకుండా అలాగే ఉంచుతారు. కానీ ఇలా వైఫై రూటర్ ఆన్ లో ఉంచడం మంచిది కాదు.
పగటి సమయం ఎలాగు వైఫై పనిచేస్తూనే ఉంటుంది. రాత్రి కూడా దాన్ని ఆన్ లోనే ఉంచితే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి.
ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే మీరెప్పుడూ వైఫై ఆఫ్ చెయ్యడం మరిచిపోరు కూడా. ఇంతకీ రాత్రిళ్ళు వైపై ఆన్ లోనే ఉంచడం వల్ల ఏర్పడే పరిణామాలు ఏమిటంటే..
రాత్రిపూట వైఫై ఆన్(Wi Fi on at night times) లోనే ఉంటే ప్రమాదకరమా? అంటే అవునని చెప్పవచ్చు. వైఫై ఆన్ లో ఉన్నప్పుడు ఇల్లంతా రేడియేషన్(Radiation) ప్రసారం జరుగుతుంది.
ఈ రేడియేషన్ ఇంటి గోడలపైకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైఫై రూటర్ గార్డ్ ఉపయోగించని పక్షంలో ఈ రేడియేషన్ చాలా హాని చేస్తుంది.
సహజంగానే సెల్ ఫోన్(cell phone beside sleeping) పక్కన పెట్టుకుని పడుకునే అలవాటున్న చాలామందిలో నిద్రలేమి సమస్య(Insomnia) ఉంటుంది. వైఫై రాత్రి ఆప్ చేయడం వల్ల దాని ఆధారంగా పనిచేసే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు విశ్రాంతిలోకి వెళతాయి.
ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల కలిగే డిస్టర్బెన్స్ ను ఈ కారణంగా తప్పించుకోవచ్చు. మొబైల్ నోటిఫికేషన్లు, ఇతర అప్లికేషన్ల పని ఆగిపోతుంది.
దీనివల్ల నిద్రకు ఆటంకం తప్పుతుంది. చాలామంది నిద్రమధ్యలో లేచి మొబైల్ చెక్ చేస్తుంటారు. వైఫై ఆఫ్ చేస్తే రాత్రి సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరాల రేడియేషన్ కారణంగా(pineal) పీనియల్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. ఈ గ్రంధి శరీరంలో మెలటోనిన్(melatonin) ఉత్పత్తి చేస్తుంది, ఈ మెలటోనిన్ నిద్రా చక్రం అయిన సిర్కాడియన్ రిథమ్(circadian rhythm) ను నింయంత్రించే హార్మోన్.
రాత్రిపూట వైపై ఆన్ లోనే ఉంటే ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, కండరాల పనితీరు దెబ్బతినడం, శరీరంలో టాక్సిన్లు బయటకు పంపడంలో ఆంటకం ఏర్పడతాయి.
మన శరీరంలో ప్రతి సెకెనుకు 2మిలియన్లకంటే ఎక్కువ ఎర్రరక్తకణాలు(2million red blood cells are produced for every second) ఉత్పత్తి అవుతాయి. ఈ రక్తకణాలలో మైక్రోస్కోపిక్ యాంటెన్నా లాంటి గ్రాహకం ఉంటుంది. ఇది శరీరానికి అందే రసాయనాలతో కమ్యూనికేట్ చేస్తుంది.
దురదుృష్టం కొద్దీ ఇది రేడియేషన్ ను కూడా గ్రహిస్తుంది. ఈ కారణం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది.
రక్షణ వ్యవస్థ నిరంతరం పనిచేయం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన కొత్త కణాలు తయారవడం మందగిస్తుంది, శరీర సామర్థ్యం ప్రభావితమవుతుంది. శరీరానికి కీలకమైన పోషకాలు గ్రహించే సామర్యం తగ్గిపోతుంది.
శరీరంలో టాక్సిన్లు బయటకు పంపే వ్యవస్థ మందగిస్తుంది. రక్తం శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ ను తీసుకెళ్ళలేదు. ఇది మాత్రమే కాకుండా మెదడు పనితీరుమీదా.. మెదడు కణాల మీదా ప్రభావం ఉంటుంది.
శరీరంలో కణాలు తొందరగా విచ్చిన్నం కావడం వల్ల మనిషి జీవిత కాలంకూడా తొందరగా ముగుస్తుంది.
0 Comments:
Post a Comment