White Hair Solution: రూ.10 గల ఈ వస్తువులతో తెల్ల జుట్టు 5 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!
How To Remove White Hair Naturally: ఆధునిక జీవనశైలి కానణంగా చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.
అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నల్ల జుట్టును పొందడానికి పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టునే కాకుండా జుట్టు రాలడం, ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ఇంటి చిట్కాలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల జుట్టును మార్చే అద్భుత గుణాలు కలిగిన మూలికలు:
బ్లాక్ వాల్ నట్స్:
తెల్ల జట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బ్లాక్ వాల్‌నట్స్ ప్రభావంతంగా సహాయపడతాయి. వాల్‌నట్ తొక్కను పొడిగా తయారు చేసి ఓ గిన్నెలతో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో గోరువెచ్చని నీటిలో ఈ పొడిని నానబెట్టి 2 గంటల తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉసిరి పొడి:
కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంద. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నూనెను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ నూనెను వేడి చేసి జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల తల నొప్పి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
హెన్నా పొడి:
హెన్నా పౌడర్ సహాయంతో తెల్ల జుట్టు సులభంగా నల్లగా తయారవుతుంది. గోరింట పొడి, కాఫీ పొడి, నిమ్మరసం..ఈ మూడింటి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. దీనిని వినియోగించడం వల్ల కుదళ్లు కూడా బలంగా మారుతాయి.
(నోట: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. మన్నం వెబ్ దానిని నిర్ధారించలేదు.)
0 Comments:
Post a Comment