Viral News: డిగ్రీ కూడా చదవలేదు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే..
సంపాదనకు చదువుతో సంబంధం లేదని ఇప్పటికే ఎంతోమంది ప్రాక్టికల్‌గా నిరూపించారు. నచ్చిన రంగంలో శ్రమిస్తూ, వైట్ కాలర్ జాబ్స్‌కు దీటుగా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఆదాయం ఆర్జిస్తున్నవారు చాలామంది కనిపిస్తారు.
ఇలాంటి కోవకే చెందుతాడు బ్రిటన్‌కు చెందిన ఒక ప్లంబర్ (Plumber). అతడు కనీసం డిగ్రీ (Degree) కూడా చదవలేదు. కానీ సంపాదన మాత్రం ఏడాదికి రూ.2కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇంతకీ అతడు చేసే పని ఏంటి? అంత సంపదాన ఎలా సాధ్యం అనే వివరాలు తెలుసుకుందాం.
యూకేలోని కెన్సింగ్టన్‌కి చెందిన స్టీఫెన్ ఫ్రై అనే ప్లంబర్, తన యాన్యువల్ ఇన్‌కం £210,000 (దాదాపు రూ.2.15 కోట్లు)తో వార్తల్లో నిలిచాడు. యూనివర్సిటీ డిగ్రీ లేనప్పటికీ, అతడు మాల్దీవులలో లగ్జీరియస్ వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తాడు. లండన్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇరవైలలో అతను సొంత ప్లంబింగ్ బిజినెస్ ప్రారంభించాడు. పదేళ్ల క్రితం పిమ్లికో ప్లంబర్స్‌లో చేరాడు. కంపెనీలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.
ఫ్రై, డైలీ రొటీన్ చాలా బిజీగా ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుంటాడు. పని దినాలలో రాత్రంతా ఎమర్జెన్సీ కాల్స్ కోసం అందుబాటులో ఉంటాడు. ఇలా వారానికి 58 గంటలు పని చేస్తాడు. ప్లంబర్లు చాలా తక్కువ సంఖ్యలోనే యాన్యువల్ శాలరీ £200,000 కంటే ఎక్కువగా పొందుతారని అంచనా. ఆశ్చర్యకరంగా పిమ్లికో ప్లంబర్స్‌లోని సగం మంది ఉద్యోగులు సంవత్సరానికి £100,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
* ఓపిక ఉన్నంత వరకు పని చేస్తా
ఆదివారం మెయిల్ న్యూస్ ఏజెన్సీకి స్టీఫెన్ ఫ్రై ఇంటర్వ్యూ ఇచ్చాడు. డిమాండ్‌తో కూడిన పనిభారం కారణంగా తీవ్ర అలసట ఎదుర్కొంటున్నప్పటికీ, తన ఉద్యోగం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు. ప్రతి రోజు ఆనందంగా ఉంటానని, వాటర్ లీకేజీ సమస్యతో బాధపడుతున్న మహిళలకు చాలా సందర్భాల్లో ఉపశమనం కలిగించానని వివరించాడు. ఫ్రై తన పని పట్ల తనకున్న అంకితభావాన్ని తెలిపాడు. ఓపిక ఉన్నంత వరకు పనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
0 Comments:
Post a Comment