Uric Acid High: కీళ్ల నొప్పులకు కారణాలు ఇవే, ఇలా నయా పైసా ఖర్చు లేకుండా 7 రోజుల్లో తగ్గించుకోవచ్చు..
Bottle Gourd Juice For Uric Acid: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తున్నాయి. శరీర వ్యర్థ్య పదార్థాలు పేరుకుపోయి కీళ్ల నొప్పులకు దారి తీస్తోంది.
దీని కారణంగా నవడంలో ఇబ్బంది, పాదాల్లో వాపు ఇతర అనేక రకాల నొప్పులు వస్తున్నాయని నిపుణులు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేయడం కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర కీళ్ల నొప్పుల కారణంగా ఇతర వ్యాధులకు కూడా దారి తీయోచ్చు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది. ఆ రసాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ పేషెంట్లు సోరకాయ రసం తాగాలి!
సోరకాయ రసంలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ఒక సోరకాయను తీసుకోవాల్సి ఉంటుంది. దానిని ముక్కలుగా కట్ చేసి మిక్సర్ గ్రైండర్‌లో వేసి బాగా జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని గ్లాసులో సర్వ్ చేసుకుని తాగితే..శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ సులభంగా నియంత్రణలో ఉంటుంది.
సోరకాయ ప్రయోజనాలు:
డయాబెటిస్‌ని నియంత్రిస్తుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారు సోరకాయ రసం ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
ఊబకాయ సమస్యకు చెక్:
శరీర బరువును నియంత్రించేందుకు సోరకాయ జ్యూస్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి..ఊబకాయం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా ట్రిపుల్ నాళాల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి సోరకాయ రసం ప్రతి రోజు తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. మన్నం వెబ్ దానిని ధృవీకరించలేదు.)
0 Comments:
Post a Comment