Under arms - అండర్ ఆర్మ్స్ లోని నలుపును కేవలం ఒక్క వాష్ లోనే వదిలించుకోండిలా..
బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells) పేరుకుపోవడం, మాయిశ్చరైజర్ రాయకపోవడం, శరీరంలో అధిక వేడి, చెమట తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి.
ఈ నలుపు కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మగువలు డార్క్ అండర్ ఆర్మ్స్ వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇష్టమైన దుస్తులు వేసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు.
ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్( Underarms) లోని నలుపును వదిలించడానికి ముప్ప తిప్పలు పడుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఒక్క వాష్ లోనే నలుపు మొత్తం మాయం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పసుపు( turmaric ) వేసి నల్లగా మారేంతవరకు వేయించాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేయించిన పసుపును వేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( coffee powder ) వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. చివరిగా రెండు టేబుల్ స్పూన్లు పాలతో పాటు సరిపడా రోజ్ వాటర్ ను వేసుకుని అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసి పది నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి. అనంతరం అర నిమ్మ చెక్కను తీసుకొని అండర్ ఆర్మ్స్ ను కనీసం ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ అండర్ ఆర్మ్స్ లో నలుపు చాలా వరకు పోతుంది. బెస్ట్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు. ఇంకా నలుపు కనుక ఉంటే రెండు మూడు సార్లు ఈ రెమెడీని పాటించండి. దాంతో మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా మృదువుగా కోమలంగా మారతాయి.
0 Comments:
Post a Comment