*📚✍️మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలు
♦️ఈటీఎస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
♦️విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు
🌻అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ విద్యా రంగంలో మరో విప్లవాత్మక అడుగుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు మూడో తరగతి నుండే టోఫెల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. శుక్రవారం సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఈటీఎస్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో శామ్ ఓమెన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల విద్యార్ధులు ప్రపంచస్థాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లని, వారి జీవితాల్లో మార్పుతేవడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తే దేవుడి దృష్టిలో వారి కుటుంబాలకు గొప్ప సేవచేసినవాళ్లం అవుతామని, మనం ఏ కార్యక్రమం చేసినా... అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదొక సవాల్తో కూడిన కార్యక్రమమని, ఈ జూనియర్ లెవెల్కే పరిమితం చేయకుండా... ప్లస్ వన్, ప్లస్ టూ సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలన్నారు. 11, 12 తరగతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విదేశాలకు వెళ్తారని, అందుకే జూనియర్ లెవెల్తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలని అన్నారు. మీరు మా ప్రభుత్వ బడులను చూడాలని, అప్పుడే మీకు తాము విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. మీరు ప్రవేశపెడుతున్న కోర్సులను ఏ రకంగా మిళితం చేయవచ్చు అనేది అర్ధం చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 6వ తరగతి ఆపై తరగతులకు సంబంధించిన దాదాపు 30,230 క్లాస్ట్రూమ్లను అంటే దాదాపు 50 శాతం తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నామని, మొత్తంగా దాదాపు 63 వేల క్లాస్ రూమ్లను డిసెంబరు నాటికి డిజిటలైజ్ చేయబోతున్నామని చెప్పారు. మరోవైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్థికి ట్యాబులు పంపిణీ చేశామని చెప్పారు. ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా విద్యార్ధులకు బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ద్వారా కరిక్యులమ్ బైజూస్ కంటెంట్ను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వీటికి అదనంగా ఇప్పుడు. టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. ఇది మంచి మార్పులకు దారితీస్తుందన్నారు. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
ఈటిఎస్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ ఛానల్ అలైన్ డౌమాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం స్వరూపాన్ని మార్చే కార్యక్రమం ఇదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ దార్శినిక నాయకత్వంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈటీఎస్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రగతిశీలక ముందడుగు అన్నారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు ఈ ఒప్పందం చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థు లను చైతన్యవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుం దన్నారు. తన వరకు చూస్తే.. తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఫ్రాన్స్క చెందినవాళ్లని, ఇద్దరికీ ఇంగ్లిషు ఒక్క ముక్కరా దని, తాను ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా వెళ్లగలిగానని, అమెరికా పౌరసత్వం పొందగలిగానని చెప్పారు. అంతేకా దు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికాలోని ప్రిన్స్టనక్కు వచ్చి విద్యను అభ్యసిస్తారని భావిస్తున్నాన న్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
0 Comments:
Post a Comment