Titanic | అప్పుడు తాత.. ఇప్పుడు భర్త.. ఆమె జీవితంలో చీకట్లు నింపిన టైటానిక్
Titanic | సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ షిప్ ఓ కుటుంబంలో రెండుసార్లు విషాదాన్ని నింపింది. ఓ మహిళకు తీరని శోకాన్ని మిగిల్చింది. అప్పుడు భారీ నౌక మునిగిన సమయంలో ముత్తాతను తనలో కలిపేసుకుంటే..
ఇప్పుడు దాని శిథిలాలను చూసేందుకు వెళ్లిన భర్తను బలితీసుకుంది.
Titanic | సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ షిప్ ఓ కుటుంబంలో రెండుసార్లు విషాదాన్ని నింపింది. ఓ మహిళకు తీరని శోకాన్ని మిగిల్చింది. అప్పుడు భారీ నౌక మునిగిన సమయంలో ముత్తాతను తనలో కలిపేసుకుంటే.. ఇప్పుడు దాని శిథిలాలను చూసేందుకు వెళ్లిన భర్తను బలితీసుకుంది.
టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన జలంతర్గామి టైటాన్ సముద్రగర్భం ( Titan Submersible )లోనే పేలిపోయింది. అందులో వెళ్లిన ఐదుగురు సజీవసమాధి అయ్యారు. వీరిలో 48 ఏండ్ల పాక్ బిలియనీర్ షహజాదా దావుద్, ఆయన కుమారుడు సులామాన్, యూఏఈలో నివాసం ఉంటున్న బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషియన్‌గేట్ ( Ocean Gate ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్ ( Stockton Rush ), ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. అయితే ఈ ఘటనలో స్టాక్టన్ రష్ భార్య వెండీ రష్ ( Wendy Rush ) గురించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అదేంటంటే.. అప్పట్లో టైటానిక్ షిప్‌లో ప్రయాణించేందుకు వెళ్లి వెండీ రష్ పూర్వీకులు మరణిస్తే.. ఇప్పుడు టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లి ఆమె భర్త ప్రాణాలు కోల్పోయారు.
వెండీ రష్ ముత్తాత ఇసిడోర్ స్ట్రాస్- ఇడా దంపతులు న్యూయార్క్‌లోనే అత్యంత ధనవంతులు. 1912లో వాళ్లు టైటానిక్ నౌకలో తొలి ప్రయాణాన్ని చేయాలని ఆశపడ్డారు. టికెట్ బుక్ చేసుకుని అందులో ప్రయాణించారు కూడా. అయితే ప్రమాదవశాత్తూ టైటానిక్ షిప్ మంచు కొండను ఢీకొనడంతో సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో మహిళలు, చిన్న పిల్లలను ముందుగా రెస్క్యూ బోట్స్ ద్వారా బయటకు పంపించారు. కానీ ఇసిడోర్‌ను వదిలి వెళ్లడం ఇష్టం లేక ఇడా కూడా షిప్‌లోనే ఉండిపోయింది. చివరకు షిప్ మునిగిపోవడంతో ఇసిడోర్ దంపతులు ఇద్దరూ మరణించారు. ఇది జరిగి 110 సంవత్సరాలపైనే అయిపోయింది. అయినా టైటానిక్ వారి కుటుంబాన్ని వదల్లేదు. సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను ఎలాగైనా చేరుకోవడమే వెండీ రష్ భర్త స్టాక్టన్ రష్ పనిగా పెట్టుకున్నాడు. దీనికోసం తన ఓషియన్‌గేట్స్ కంపెనీ ద్వారా చాలా ఏండ్లుగా శ్రమించాడు. టైటానిక్ శిథిలాల కోసం ఓషియన్‌గేట్ ద్వారా పలు సాహసయాత్రలు నిర్వహించారు. చివరకు ఈ సాహసయాత్రలోనే స్టాక్టన్ రష్ జలసమాధి అయ్యాడు. అన్నట్టు అదే కంపెనీలో కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెండీ రష్ కూడా ఈ సాహసయాత్రల్లో రెండుసార్లు పాల్గొంది.
ఈ సాహస యాత్రలో భాగంగానే ఈ నెల 18న టైటాన్ జలంతర్గామి బయల్దేరింది. కానీ ప్రయాణం మొదలైన కాసేపటికే సబ్‌మెరైన్ నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయాయి. దీంతో గల్లంతైన జలంతర్గామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో గురువారం వరకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్ నిల్వలు ఉండటంతో ఈ లోపు ఎలాగైనా గల్లంతైన జలంతర్గామిని కనిపెట్టాలని తీవ్రంగా క్షమించారు. ఏదైనా అద్భుతం జరిగి వాళ్లంతా ప్రాణాలతో ఉండాలని ప్రార్థించారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. గురువారం అర్ధరాత్రి సమయంలో టైటాన్ పేలిపోయినట్లుగా గుర్తించారు. సముద్రంలో ఒత్తిడి కారణంగా గల్లంతైన కాసేపటికే సబ్ మెరైన్ పేలినట్లు నిర్ధారించారు. దీంతో ఆ జలంతర్గామిలో వెళ్లిన స్టాక్టన్ రష్ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే టైటానిక్ కారణంగా వెండీ రష్ అప్పుడు ముత్తాత దంపతులను, ఇప్పుడు భర్తను పోగొట్టుకున్నారన్న విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
0 Comments:
Post a Comment