నలుగురు టీచర్లు సస్పెన్షన్
అనంతపురం జూన్ 3:
@గార్లదిన్నె మండలం పెనకచర్ల ఎంపీపీఎస్ మెయిన్ స్కూల్ ఎస్జిటి టీచర్ జి. లక్ష్మీదేవి, పామిడి మండలం ఓబులాపురం గ్రామం ఎంపిపిఎస్ పి. రోజామేరీ, గుత్తి 9వ వార్డు ఎంపీపీ ఎస్ హెచ్ఎం కంబగిరి రాముడు, గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న ఎంపీపీఎస్ ఎస్ జి టి టీచర్ నూరునిషా లను సస్పెన్షన్ చేస్తూ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం సాయిరామ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాడు-నేడు రెండో విడత పనులకు డబ్బులు మంజూరు చేసినప్పటికీ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు సస్పెన్షన్ చేయడం జరిగిందని తెలిపారు.
0 Comments:
Post a Comment