వేసవి సెలవులు పొడగించే అవకాశం???
గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత పదిరోజుల నుంచి ఉష్ట్రోగ్రత తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటుతున్న సందర్భాలు పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. త్వరలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండ ప్రభావం వల్ల పాఠశాలను పునః ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు జంకుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
గతనెల నుంచి దేశ వ్యాప్తంగా ఎండలో మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ నమోదు అవుతుంది. ఇదిలా ఉంటే విద్యార్థులకు వేసవి సెలవులు ముగియబోతున్నాయి.. జూన్ మాసంలో 12 న పాఠశాలలు పునఃప్రారంభిస్తుంటారు. కానీ వేసవి ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో పలు రాష్ట్రాల ప్రభుత్వ స్కూల్స్ ని ఓపెన్ చేయడానికి జంకుతున్నాయి. తాజాగా పాఠశాలల వేసవి సెలవులను పొడగిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో పాఠశాలల సెలవులను పొడగిస్తున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ప్రకటించారు.
రోజు రోజుకీ ఎండల ప్రభావం అధికం కావడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడతారని అందుకే సెలవులను పొడిగిస్తే మంచిదని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని.. అరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని.. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల నిర్వహకులు ప్రభుత్వాన్ని కోరడంతో వేసవి సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 11 వరకు సెలవులను పొడగించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జూన్ 12 నుంచి, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు జూన్ 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ లో జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.. ఒకవేళ ఎండలు తీవ్రత ఇలాగే కొనసాగితే.. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
0 Comments:
Post a Comment