Strong Bones: 80 సంవత్సరాలు వచ్చిన మీ ఎముకలు అరిగిపోకుండా ఉండడాలంటే ఇవి తినండి!
Food For Strong Bones: ప్రస్తుతం చాలా మందిలో చిన్న వయసుల్లో ఎముకల బలహీనత సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలలో ఇలాంటి సమస్య బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
చాలా మందిలో ఎముకల బలహీనత సమస్యలు రావడానికి పోషకాహార లోపంతో పాటు ఆధునిక జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని తింటే ఎముకలు దృఢంగా మారుతాయి:
40 ఏళ్ల తర్వాత కూడా మీ ఎముకలు దృఢంగా, పగల కుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కాల్షియం, విటమిన్ డి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఎముకల బలహీన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. తరచుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాల ఉత్పత్తులు
ఆకు కూరలు
ఓట్స్
ఖిచ్డీ
క్యారెట్లు
బఠానీలు
తృణధాన్యాలు
పండ్లు
దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది:
భోజనం సమయంలో ప్రతి రోజు సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కాల్షియం సమృద్ధిగా ఉండే సూపర్‌ఫుడ్స్ ప్రతి రోజు రెండు సార్లు తీసుకోవాలి.
కొవ్వు తక్కువగా ఉండే మిల్లు ఉత్పత్తులను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు,
పాలు, పప్పు ధాన్యలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి రోజు ఉడికించిన గుడ్లతో పాటు నాన్‌వెజ్ కూడా తీసుకోవాలి.
ప్రతి రోజు 10 నుంచి 15 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది.
ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. మన్నం వెబ్ దానిని ధృవీకరించలేదు.)
0 Comments:
Post a Comment