SBI: కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..క్షణాల్లో అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.
బ్యాంకుకు వెళ్లకుండానే అకౌంట్ పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఒక నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మన బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి +917208933148 కి ‘WAREG అకౌంట్ నంబర్’ ఫార్మాట్‌లో SMS పంపాలి. ఉదాహరణకు మీ ఖాతా నంబర్ 123456789 అయితే WAREG 123456789 అని టైప్ చేసిన ఆ నంబర్‌కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ విజయ వంతంగా పూర్తియిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లోని వాట్సాప్‌కు కన్ఫర్మేషన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్ లో +919022690226 నంబర్ సేవ్ చేసుకోవాలి.. ఆ తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేసి ఆ నంబర్ హాయ్ అని మెసేజ్ చెయ్యండి.. ఆ తర్వాత కొన్ని ఆఫ్షన్స్ వస్తాయి.. మీకు కావలసిన అప్షన్ ను ఎంపిక చేసుకోండి..
డిజిటల్ బ్యాంకింగ్, ముఖ్యమైన పత్రాల డౌన్‌లోడ్, హాలిడే క్యాలెండర్, డెబిట్ కార్డ్ సమాచారం, కార్డ్ పోగొట్టుకుంటే దాని సంబంధిత వివరాలు, సమీప ఏటీఎం, బ్రాంచ్ లొకేటర్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సర్వీసుల ను వాట్సాప్ ద్వారానే కస్టమర్లు పొందవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.. అయితే బ్యాంకు అకౌంట్ కు నంబర్ లింక్ చెయ్యకుంటే వెంటనే ఆ పని చెయ్యాలి.. అప్పుడే మీరు ఈ సేవలను పొందుతారు.. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే దగ్గరలోని బ్రాంచ్ కు వెళ్లి అడిగి తెలుసుకోవచ్చు.. దేశీయ బ్యాంక్ అయిన ఎస్బిఐ ఇప్పటికే కష్టమర్స్ కోసం ఎన్నెన్నో పథకాలను అందుబాటు లోకి తీసుకురావడం తో పాటు అనేక సేవలను కూడా అందించింది.. ప్రస్తుతం కస్టమర్స్ కోసం మరికొని సేవలను అందుబాటులోకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు చేస్తుంది..
0 Comments:
Post a Comment