SBI Wrong Transfer: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బు పంపారా..? నో టెన్షన్.. తిరిగి పొందండిలా..
ఆన్‌లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది స్మార్ట్‌ఫోన్లతోనే సులభంగా ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు.
ఈ సమయంలో పొరపాటున వేరే వారి ఖాతాలోకి డబ్బులు పంపించే ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కూడా ఇదే సమస్యను ఫేస్ చేశాడు.
పొరపాటున వేరే అకౌంట్‌కు వెళ్లిపోయిన ఆ డబ్బులు ఎలా పొందాలో తెలపాలంటూ ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐని కోరాడు. అతడి ఫిర్యాదుకు SBI అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ స్పందించింది. రెండు మార్గాలలో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపింది. అవేవో తెలుసుకుందాం.
* కస్టమర్ ఫిర్యాదు : కస్టమర్ SBI అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ పొరపాటున వేరే అకౌంట్‌కు పేమెంట్ చేశామని ట్వీట్ చేశాడు. హెల్ప్‌లైన్ సలహా కోరానని, అవసరమైన అన్ని వివరాలను బ్యాంక్ బ్రాంచ్‌కు అందించానని, కానీ అధికారులు డబ్బులు వెనక్కు వచ్చే విషయమై ఎలాంటి సమాచారం అందించలేదని పేర్కొన్నాడు.
* ఎస్‌బీఐ చెప్పిన పరిష్కారం : SBI అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ సదరు కస్టమర్ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తప్పు లబ్ధిదారుని పేర్కొన్న సందర్భాల్లో.. కస్టమర్‌పై ఎలాంటి జరిమానా విధించకుండా హోమ్ బ్రాంచ్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఇక్కడ హోమ్ బ్రాంచ్ కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేసిన బ్రాంచ్.
బ్రాంచ్ లెవల్‌లో సమస్య పరిష్కారం కాకపోతే, SBI అధికారిక వెబ్‌సైట్ https://crcf.sbi.co.in/ccf లో ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌బీఐ కస్టమర్‌కి సూచించింది. పర్సనల్ సెగ్మెంట్ లేదా ఇండివిడ్యువల్ కస్టమర్ కేటగిరీ కింద జనరల్ బ్యాంకింగ్/బ్రాంచ్ రిలేటెడ్/నో రెస్పాన్స్ టు క్వారీస్ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలని తెలిపింది. కామెంట్ బాక్స్‌లో సమస్య గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ రాయాలని కోరింది.
* పొరపాటుకు బ్యాంకు బాధ్యత వహించదు : ఇదే సమస్యను ఫేస్ చేసిన మరొక కస్టమర్‌కు కూడా SBI సమాధానం ఇచ్చింది. ఖాతాదారుడు చేసే తప్పుడు లావాదేవీలకు బ్యాంకు బాధ్యత వహించదని స్పష్టం చేసింది. అయినా, కస్టమర్ హోమ్ బ్రాంచ్ ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఇతర బ్యాంకులతో తదుపరి ప్రక్రియలను ప్రారంభిస్తుందని తెలిపింది. తదుపరి సహాయం కోసం, కస్టమర్ వారి హోమ్ బ్రాంచ్, సంబంధిత లబ్ధిదారుడి బ్యాంక్‌ను సంప్రదించాలని సూచించింది.
* ఈమెయిల్స్‌కి రిప్లై లేకపోతే? : బ్యాంకుకు పంపిన ఈమెయిల్స్‌కి రిప్లై ఇవ్వడం లేదని ఓ సీనియర్ సిటిజన్ ఎస్‌బీఐ కస్టమర్ ట్విట్టర్‌లో నిరాశను వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ SBI అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ https://crcf.sbi.co.in/ccf లో ఫిర్యాదును నమోదు చేసుకోవాలని కస్టమర్‌కు సూచించింది.
ఇందుకు సైట్‌లో రిజిస్టర్ యువర్ కంప్లైంట్ > రైజ్ కంప్లైంట్ ఆర్ రిక్వెస్ట్ > పర్సనల్ సెగ్మెంట్/ఇండివిడ్యువల్ కస్టమర్ కేటగిరీ కింద నో రెస్పాన్స్ టు క్వారీస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలని తెలిపింది. తమ బృందం దీనిపై విచారణ జరుపుతుందని ఎస్‌బీఐ కస్టమర్‌కు హామీ ఇచ్చింది.
0 Comments:
Post a Comment