SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలిలా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ, పీజీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అర్హత గల అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 21, 2023న ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలిలా..
1. వైస్ ప్రెసిడెంట్: 1 పోస్ట్
2. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ - ప్రోగ్రామ్ మేనేజర్: 4 పోస్టులు
3. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ - క్వాలిటీ & ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ & అవుట్‌బౌండ్): 1 పోస్ట్
4. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ (మార్కెటింగ్): 1 పోస్ట్
5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) / చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్): 18 పోస్టులు
అర్హతలు..
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరాల నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత మరియు వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తుల ఫీజు..
జనరల్/EWS/OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు.. ఇతర ఛార్జీలతో రూ. 750 చెల్లించాలి. SC/ST/PWBD అభ్యర్థులకు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీలు లేవు.
దరఖాస్తులు ఇలా..
-SBI వెబ్‌సైట్ sbi.co.in లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా నమోదు చేసుకోండి.
-తాజా ఫోటోగ్రాఫ్ అండ్ సంతకం స్కాన్ చేయబడింది.
-దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. తప్పులకు అవకాశం లేకుండా నింపండి.
- తర్వాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను మీ మొబైల్ కు వస్తుంది.
- దీనిని ఉపయోగించి..లాగిన్ అవ్వండి. దీనిలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకు వెళ్లండి.
-సిస్టమ్ రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
0 Comments:
Post a Comment