Russian Tourist Eaten By Shark: సముద్రంలో ఈత కొడుతున్న యువకుడిని నమిలి మింగేసిన సొరచేప
Russian Tourist Eaten By Shark: సముద్రంలో ఆటలు అసలే తగవు. ఒక చిన్న రిజర్వాయర్ నీళ్లలోనే ముసళ్లు ఉన్నాయి నీటిలో దిగకూడదు జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తూ బోర్డులు పెట్టి ఉంటాయి.
అలాంటిది సముద్రం వద్దకు వెళ్లినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏ హెచ్చరిక బోర్డులు ఉన్నా.. లేకున్నా .. ఎవ్వరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలి కదా.. కానీ ఇదిగో వీడియోలో ఉన్న యువకుడు అలాంటిదేం పట్టించుకోకుండా సముద్రంలోకి దిగి ఈత కొట్టడం ఆరంభించాడు. ఈ డేంజరస్, హారిఫిక్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం..
ఈ హారిఫిక్ వీడియోలో ఉన్న మేటర్ ఏంటంటే.. ఒక 24 ఏళ్ల యువకుడు సముద్రం ఒడ్డున ఈతకు దిగాడు. సముద్రం ఒడ్డున ఈత కొడితే పర్వాలేదు కానీ ఇంకొంత లోపలి వరకు వెళ్లాడు. అక్కడే ఉన్న టైగర్ షార్క్ అతడిని వెంబడించడం మొదలుపెట్టింది. షార్క్ తనని సమీపిస్తుండటం చూసిన యువకుడు గట్టిగా కేకలు వేస్తూ ఒడ్డుకు ఈత కొడుతూ వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యం చూస్తున్న వాళ్లంతా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందా అని ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉన్నారు. చివరకు షార్క్ అతడిని నోట కరుచుకుని మింగేసింది.
0 Comments:
Post a Comment