Railway Recruitment 2023: టెన్త్ అర్హతతో 3624 రైల్వే జాబ్స్.. రేపటి నుంచే అప్లికేషన్లు.. వివరాలివే
వెస్ట్రన్ రైల్వేకు ( Western Railway) చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3624 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు rrc-wr.com వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి తప్పనిసరిగా 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 26 నాటికి 15-24 ఏళ్లు ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక: మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD/Women అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్ నెట్ బ్యాంక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment