QR Code - క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా..
క్యూఆర్ కోడ్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజలు నేడు అత్యధిక సంఖ్యలో డిజిటల్ చెల్లింపులు మీదే ఆధారపడుతున్నారు. వారిలో మన భారతీయులే ఎక్కువ.
అవును, అనేకమంది ఇంజనీర్లు పలు యాప్ లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం అయ్యేలా చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ఇంపార్టెంట్ క్రియేట్ చేసింది క్యూఆర్ కోడ్ ( QR code )మాత్రమే. దీని సహాయంతో ఎవరికైనా నగదును ఈజీగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం వల్ల ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అంతలా ఉపయోగపడుతున్న ఈ క్యూఆర్ కోడ్ గురించి మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? అనే విషయాన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించారా.
లేదు కదూ. అందుకే ఇపుడు దాని గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతిచోటా ఈ క్యూఆర్ కోడ్లను విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం కావచ్చు, దానిని గుర్తించడంలో దీని వినియోగం ఎక్కువగా అవసరం పడుతుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో ఎక్కువగా మనకు కనబడుతుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుందని మీలో ఎంతమందికి తెలుసు. అయితే, ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్లను వాడుతూ వుంటారు. బార్కోడ్( Barcode ) ఎలా వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ క్యూఆర్ కోడ్ పని చేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా వెరైటీగా కనబడుతుంది. మనకు క్యూఆర్ కోడ్లో అనేక డాట్స్ అనేవి కనిపిస్తాయి. అయితే, బార్కోడ్లో కేవలం గీతలు మాత్రమే కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్ ఐతే 2వది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ ( Static QR code )కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ ( Dynamic QR code ) డ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేస్తుంది.
0 Comments:
Post a Comment