📚✍️నేను రూపొందించిన వీడియోను టీచర్లు చూడాల్సిందే
♦️జిల్లా విద్యాధికారులకు ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు
🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రూపొందించిన ఒక వీడి యోను ఉపాధ్యాయులు తప్పనిసరిగా చూడాలని పేర్కొంటూ జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల 'డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ' పేరుతో ఓ వీడియోను రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోను చాలా మంది ఉపాధ్యాయులు చూడకపోవడం ఆయనకు ఆగ్రహాన్ని కలిగిం చింది. వెంటనే అందరూ వీడియో చూడాల్సిందేనంటూ జిల్లా విద్యాధికారులకు నేరుగా ఆదేశాలు ఇచ్చేశారు. 'రేపల్లె పురపాలక పాఠశాలను సందర్శించినపుడు చాలా మంది ఉపాధ్యాయులు 'డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ' కార్యక్రమాన్ని చూడలేదని గమనించాను. ప్రభుత్వ ప్రాధాన్యాలను చెబుతూ చేసిన 27 నిమిషాల వీడి యోను చూడటానికి సమయం లేదా? ఇది ఆమోద యోగ్యం కాదు. ప్రిన్సిపల్ సెక్రెటరీ బిజీ షెడ్యూల్లోనూ అర్ధరాత్రి సమయంలో తన సమయాన్ని వెచ్చించి రికార్డు చేసినందుకు అభినందించండి. వీడియో చూసేలా ఉపాధ్యాయులను చైతన్యవంతులను చేయండి. ప్రిన్సిపల్ సెక్రెటరీ సందర్శన సమయంలో ఎవరైనా ఉపాధ్యాయులు పూర్తి వీడియోను చూడకపోతే అది ఉద్దేశపూర్వకంగా చేసినట్లు భావిస్తామని చెప్పండి' అని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉపాధ్యా యులందరూ ఈ వీడియోను చూసే పనిలో పడ్డారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ- వీడియో లింక్స్
1) https://youtu.be/jJWGVENhAes
2) https://youtu.be/Sz9gO7kIwYU
3) https://youtu.be/W-rr4cnXqPk
4) https://youtu.be/zma-D_aZ3Ss
5) https://youtu.be/AJC8mNRPLFI
6) https://youtu.be/VmzzJTstBTg
7) https://youtu.be/7esRZntp4Wk
*All teachers above links keep in ur folder*
0 Comments:
Post a Comment