రోజూ రాగి జావ ఇస్తున్నారా?
ఉపాధ్యాయులను ప్రశ్నించిన గౌ|| పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు...
ముంపు మండలాల్లోని పాఠశాలల్లో సుడిగాలి పర్యటన
వేలేరుపాడు: పాఠశాలలు తెరుచుకున్న రోజు నుంచి విద్యార్థులకు రోజూ రాగి జావ ఇస్తున్నారా అంటూ ఉపాధ్యాయులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రశ్నించారు. శనివారం పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు.
తొలుత రుద్రమకోట ప్రీహైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా అంటూ ప్రశ్నించారు.
పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ యూనిఫామ్‌లు, షూస్, పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అని అడిగారు. విద్యార్థులకు రాగి జావ అందించి వారితో కలిసి తాగారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ *పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో నూరుశాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వ ఖర్చుతో అమెరికా పర్యటనకు పంపిస్తామన్నారు.
రుద్రమకోట పాఠశాలలో యూనిఫామ్‌ను ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా మెషీన్‌పై కుట్టారు. అనంతరం
గోదావరి అవతలి ఒడ్డున ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు వెళ్లారు. గోదావరిలో కాలినడకన ఇసుకలో వెళ్లి, పడవపై కూనవరం చేరుకున్నారు.
తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4గంటలకు వేలేరుపాడు మండలం రామవరం ప్రైమరీ హైస్కూల్‌నును పరిశీలించారు. విద్యాబోధన తీరు, నోట్‌బుక్‌లను పరిశీలించారు.
రాత్రి ఎనిమిది గంటలకు భూదేవిపేటలో కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. ఆర్‌జేడీ నాగమణి, ఏపీసీ శ్యామ్‌సుందర్, సీఎంఓ రవీంద్ర, డీవైఓ ఎం.రామన్నదొర, డీడీ ఎస్.నాయుడు, జీసీడీఓ సబీహాసుల్తానా, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఈఈ రమాదేవి, ఎంఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment