📚✍️ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ
♦️టీచర్ సెలవు పెడితే సీఆర్పీలు క్లాసులు తీసుకోవాలి
♦️ఒక్కరోజు మూతపడినా సీఆర్పీలదే బాధ్యత
♦️విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం
♦️డీఈఓ శేఖర్ పనితీరుపై మండిపాటు
*🌻చంద్రగిరి(తిరుపతి రూరల్)*: మెరుగైన విద్యా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఏకోపాధ్యాయ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి 9.40 గంటల నుంచి ఆయన చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికల హైస్కూ ల్ను ఆకస్మికంగా సందర్శించారు. నాడు-నేడు. పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరి శీలించారు. విద్యార్థులు ఎంతమంది ఉంటున్నారు. ఈఏడాది 10వ తరగతి విద్యార్థులకు వచ్చిన మార్కులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎన్ని ఉన్నా యి.. అంటూ ఆరా తీశారు. ఈసందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 90,603 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయన్నారు. వారు ఏదైనా సమస్యపై సెలవు పెడితే ఆరోజు స్కూల్ను మూసివేస్తున్నారని, లేకపోతే విద్యార్థులే పాఠాలు చెప్పుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయన్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 3,012 మంది సీఆర్పీలు ఉన్నా రని, సింగిల్ టీచర్ లీవ్ పెడితే సీఆర్పీలు క్లాసులు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా సీఆర్పీలు నిర్లక్ష్యంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
♦️డీఈఓపై మండిపాటు
అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న పుస్తకాల గోడౌన్ను ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు అవసరం, ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు వచ్చాయి, ఇంకా ఏ సబ్జెక్టు పుస్తకాలు రావాల్సి ఉందంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నల వర్షం కురిపించారు. డీఈఓ శేఖర్ అసత్యాలతో కూడిన సమాధానాలు చెప్తుం డడం గుర్తించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనపై మండిపడ్డారు. కనీస సమాచారం లేకపోతే జిల్లాను ఎలా నిర్వహిస్తారు.. మీ సేవలు అవ సరం లేదనుకుంటా.. అంటూ మండిపడ్డారు.
0 Comments:
Post a Comment