PM Kisan: పీఎం కిసాన్ 14వ విడత ఎప్పుడంటే..!
రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం కింద 13 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయింది. అన్నదాతలు ఇప్పుడు 14వ విడత పీఎం కిసాన్ నిధి నిధుల కోసం వేచి చూస్తున్నారు. పలు నివేదికల ప్రకారం జూన్ చివరి వారంలో 14వ విడత డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం, 14వ విడత శుక్రవారం, జూన్ 23, 2023 నాడు రైతుల జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి నిధులు పొందాలనకుంటే దరఖాస్తు చేసుకోవాలి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లండి . ఇక్కడ కొత్త రైతు నమోదుపై క్లిక్ చేయండి. ఆపై దరఖాస్తు చేయడానికి భాషను ఎంచుకోండి. మీరు పట్టణ ప్రాంత రైతు అయితే, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. అన్ని వివరాలు నమోదు చేయాలి.
తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి. అప్పుడు మీరు అందులో నమోదు పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. అయితే ఈ పథకానికి ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ కేవైసీ చేసుకున్న వారికే డబ్బులు జమ చేస్తోంది. అయితే ఇప్పటికీ కొంత మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు. వారు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
eKYC ఎలా చేసుకోవాలంటే..
ముందుగా https://pmkisan.gov.in/ లోకి వెళ్లారు. అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్, క్యాప్చ అడుగుతుంది. ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు మీ ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చేస్తే మీ ఈకేవైసీ పూర్తి అయినట్లే.
0 Comments:
Post a Comment