PC Musthafa: కూలీ కొడుకు వందల కోట్లకు అధిపతి.. ఎలా సాధ్యమైందంటే..!
అతని తండ్రి సంపన్నుడు కాదు.. ఓ కాఫీ తోటలో పని చేసే కూలీ. అయినా ముందడుగేశాడు. ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. అతనే iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా.
కేరళకు చెందిన ముస్తాఫా పేద కుటుంబం నుంచి పైకొచ్చాడు. తండ్రి కాఫీ తోటలో పని చేసే కూలీ. తండ్రితో పాటు ముస్తఫా కూలీకి కూడా వెళ్లాడు. పని చేసుకుంటునే చదువుకున్నాడు. పదో తరగతిలో టాపర్ గా నిలిచాడు.
చివరికి ఎన్ఐటీలో సీట్ సాధించాడు. విజయవంతంగా ఇంజినీరింగ్ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అమెరికా, యూరప్ దేశాల్లో పని చేశాడు. చివరికి బెంగళూరు చేరుకున్నాడు. అక్కడ రోజు ఉదయం టిఫిన్ చేసేవాడు. అయితే టిఫిన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని భావించిన అతని మెదడులో ఓ ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే ఇప్పుడు అతన్ని కోటీశ్వరుడిని చేసింది.
ఇడ్లి, దోశ పిండి అమ్మాలని నిర్ణయించుకున్న అతను వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా వ్యాపారాన్ని క్రమంగా విస్తారించాడు. ప్రస్తుతం వారి కంపెనీ టర్నోవర్ సంవత్సరానికి రూ.300 కోట్లకు పెరిగింది. ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీకి అజీమ్ ప్రేమ్ జి మద్దతు కూడా ఉంది. iD ఫ్రెష్ ఫుడ్ పిండితో ప్రారంభమై.. తరువాత పరాటా, చపాతీలు వంటి ఇతర తాజా ఉత్పత్తులలోకి ప్రవేశించింది.
"మూడున్నర సంవత్సరాల క్రితం మేము పనీర్‌ను అమ్మడం ప్రారంభించాము. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్గాలలో ఒకటిగా నెలకు సుమారు రూ. 5 కోట్లను అందజేస్తుంది. వచ్చే సంవత్సరంలో దీనిని రూ. 100 కోట్లకు తీసుకువెళ్లాలనేది ప్రణాళిక. మేము తర్వాత పెరుగును అమ్మడం ప్రారంభించాము. ఒక సంవత్సరంలోనే, ఇది నెలకు సుమారు రూ. 2.5 కోట్లు చేస్తోంది" అని కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీకి నాలుగు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో మూడు ఉండగా..బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఒక్కోక్కటి ఉంది. మరో కేంద్రం యూఏఈలోని అజ్మాన్ లో ఉంది. త్వరలో ఢిల్లీలో ఒక ప్లాంట్‌ను, కోల్‌కతాలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
0 Comments:
Post a Comment