NPS: ఉద్యోగులకు 45 శాతం పెన్షన్.. కేంద్రం క్లారిటీ..?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..
తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగుల కు అధిక పెన్షన్ వచ్చేలా నిర్ణయం తీసుకోబోతోందని రాయిటర్స్ కథనం ప్రచూరించిన విషయం తెలిసిందే. ఉద్యోగులు తాము చివరగా అందుకున్న వేతనంలో 45 శాతం వరకు పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో దీనిపైనే అనేక చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మార్పులు చేసిన అధిక పెన్షన్ అందించనున్నారనే వార్తలపై తాజాగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది..
ఈ స్కీమ్ గురించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.. ఇంకా ఎలాంటి నిర్ధరాణలకు రాలేద ని ట్విట్టర్ ద్వారా కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్దిష్ట శాతం పెన్షన్‌ను ప్రతిపాదించబోతోందన్న వార్తల్లో నిజం లేదని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని స్పష్టం చేసింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన కు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.. అయితే వాటా దారులకు సంప్రదించే ప్రక్రియలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదని ట్విట్టర్‌లో స్వయంగా పేర్కొంది..
ఇది ఇలా ఉండగా.. ఉద్యోగులు, ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇస్తున్నప్పటికీ, ఉద్యోగులు వారి చివరి వేతనంలో 40 నుంచి 45 శాతం పింఛన్ పొందుతారని పేర్కొంది. ఎన్‌పీఎస్ ప్రకారం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం లో 10 శాతం, ప్రభుత్వం 14 శాతం చొప్పున ఈ స్కీమ్‌లో జమ చేయాలి. చివరికి చెల్లింపు అనేది ఆ కార్పస్‌పై మార్కెట్ రిటర్న్స్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ లో ఒక ఉద్యోగి చివరగా డ్రా చేసిన వేతనంలో 50 శాతం స్థిరమైన పెన్షన్ లభిస్తుంది.. త్వరలోనే ఈ విషయం పై మరో ప్రకటన వెలువడనుందని సమాచారం..
0 Comments:
Post a Comment