MBBS స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఇకపై తప్పకుండా ఆ ఎగ్జామ్ రాయాల్సిందే..!
ఇక నుంచి ఎంబీబీఎస్ విద్యార్ధులు నేషనల్ ఎగ్జిట్ టెక్ట్స్‌ను (నెక్ట్స్) ఎగ్జామ్‌ను తప్పనిసరిగా రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది.
ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహించనున్నారు. స్టెప్ 1, స్టెప్ 2 పద్ధతుల్లో అమలు చేయనున్నారు. ఎంబీబీఎస్ విద్యార్ధులకు వాళ్ల కోర్సులో భాగంగా పెట్టే ఫైనలియర్ పరీక్షలకు బదులు నెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. ఆరు సబ్జెక్టులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ఎగ్జామ్‌కు 3 గంటల సమయం ఉంటుంది.
ఈ మేరకు ఎన్‌ఎంసీ మంగళవారం నెక్ట్స్ రూల్ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసింది. నెక్స్ట్‌స్టెప్ 1 రాసిన తర్వాత ఎంబీబీఎస్ విద్యార్ధులు మళ్లీ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ప్రాక్టికల్స్‌లో పాసవ్వాలి. ఉత్తీర్ణత పొందినోళ్లు ఏడాది పాటు హౌజ్‌సర్జన్‌గా పనిచేస్తే నెక్ట్స్ 2 రాయాల్సి ఉంటుంది. దీనిలో క్లినికల్ ప్రాక్టికల్స్ ఉంటాయని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఈ రెండు విధానాల్లో వచ్చిన మార్కులు ఆధారంగా పీజీ ప్రవేశాల్లో అవకాశం ఉంటుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
0 Comments:
Post a Comment