Kids Care: మీ పిల్లలు చదువులో ముందుండాలంటే ఇలా చేయండి..
Kids Care: ఈ రోజుల్లో పిల్లలు బద్ధకస్తులుగా మారుతున్నారు. ఎప్పుడు ఫోన్లు చూస్తూనే కాలం గడిపేస్తున్నారు. ఇది కరెక్టు కాదు. పిల్లలు చురుకుగా ఉండాలి.
లేకపోతే భవిష్యత్ లో ఇబ్బందులొస్తాయి. అందుకే వారికి చిన్నతనం నుంచే యోగాసనాలు అలవాటు చేయాలి. యోగా వల్ల శరీరం స్ర్పింగులా మారుతుంది. ఎటు వంచితే అటు వంగుతుంది. అలాగే ఉంచితే మంచి లాభాలుంటాయి. యోగా చేయడం వల్ల మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. రోగాలు రాకుండా చేయడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
బకాసనం
ముందుకు వంగి కాళ్ల ముందు అరచేతులు భూమికి ఆనించాలి. చేతి వేళ్లు ముందుకు చూపుతూ వాటి మధ్య దూరం ఉండాలి. బరువంతా భుజాల సాయంతో అరచేతుల మీద ఉంచి మెల్లగా మీ పాదాల్ని పైకి లేపడానికి ప్రయత్నించాలి. మోచేతులు కాస్త వంచి మోకాళ్లు చంకల దగ్గర ఉండేలా చూసుకోవాలి. రెండు పాదాలను దగ్గరకు తీసుకురావాలి. భుజాలు వీలైంత వకు సమాంతరంగా ఉంచాలి.
బాల బకాసనం
మోచేతులు భూమికి సమాంతరంగా ఉంచుకోవాలి. చేతి వేళ్లను దూరంగా ఉంచాలి. వీటి ఆధారంగా శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. బ్యాలెన్స్ కుదిరాక పాదాలు పైకి లేపాలి. రెండు పాదాలు పక్కపక్కన ఆనించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. యోగాసనాలు ఆరోగ్యానికి శాసనాలు అని గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.
శీర్షాసనం
కాళ్లు మీదికి తల కిందికి పెట్టుకుని వేసేది శీర్షాసనం. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ల నుంచి మెదడు వరకు అన్ని అవయవాలకు రక్తం సరఫరా జరుగుతుంది. ఇలా యోగాసనాలు వేయడం వల్ల చిన్న పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది. రోజంతా హుషారుగా ఉండేందుకు సాయపడతాయి. అందుకే యోగాసనాలు వారితో రోజు వేయించడం ఎంతో మంచిది.
0 Comments:
Post a Comment