*📚✍️అధికారుల చేతివాటం
విద్యా కానుక కిట్లు సొమ్ము పక్కదారి
*🌻హనుమాన్ జంక్షన్, న్యూస్టుడే:* జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో ప్రస్తుతం జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా మండల విద్యా వనరుల కేంద్రాల్లో ఎమ్మా ర్సీల సిబ్బంది శ్రమించారు. మండలాల వారీగా వచ్చిన కిట్లను దిగుమతి చేసుకోవడం, వాటిని పాఠశాలల ఇండెంట్ల ప్రకారం సర్ది ప్రధానోపాధ్యాయులకు అప్పగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వ హించారు. దీనికి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ. మూడు వేలు చొప్పున పారితోషికం మంజూరు చేసింది. వీటితో పాటు విద్యా కానుక కిట్లను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి ఆయా పాఠశాలలకు ఒక్కో విద్యార్థికి రూ.11 చొప్పున రవాణా ఛార్జీలు సైతం కేటాయించింది. మండలాల వారీగా నివేదికలు తీసుకుని సంబంధిత ఎంఈవోల ఖాతాలకు ఈ మొత్తాన్ని బదలా యించింది. కొన్ని మండలాల్లో సంబంధిత అధికారులు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. తమకు న్యాయంగా రావాల్సిన మొత్తాన్ని అధికారులు జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమ్మార్సీ సిబ్బంది. ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం గన్నవరం నియోజకవర్గం లోని ఓ మండలంలో ఇదే విషయమై గొడవ జరిగింది. ఎమ్మార్సీ కార్యాలయంలోనే అధికారి, సిబ్బంది బహిరంగంగానే ఈ మొత్తం గురించి వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.
0 Comments:
Post a Comment