Jamun Health Benefits: నేరేడుతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Health benefits of Jamun fruit: మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. అంటే సమయానికి హెల్తీ పుడ్ తీసుకోవడం, టైంకి నిద్రపోవడం వంటివి చేయాలి.
మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా పైబర్, పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్ లో ఎక్కువగా మామిడి, వాటర్ మిలాన్, నేరేడు పళ్లు ఎక్కువగా లభిస్తాయి. నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పళ్లు ఎక్కవగా మే, జూన్ నెలలో అందుబాటులోకి వస్తాయి. దీనికి కొన్ని రోగాలను అరికట్టే గుణం ఉంది. ఇది పోషకాల గని అనే చెప్పాలి. నేరేడు పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
నేరేడు పండు తినడం వల్ల లాభాలు
** నేరేడు పళ్లు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
** నేరేడు దివ్యౌషధమనే చెప్పాలి. దీనినీ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
** నేరేడు పండులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను, మెదడను ఆరోగ్యంగా ఉంచుతాయి.
** మూత్ర సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో నేరేడు పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి.
** ఇందులో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో మీ శరీరంలోని హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. మీ రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది.
** నేరేడు మీ చర్మంపై ఉన్న మెుటిమలతోపాటు జిడ్డును కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మానికి నిగారింపును ఇస్తుంది.
** నేరేడులో విటమిన్ ఎ, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ కంటి పనితీరును మెరుగుపరచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
** జామూన్ ఫ్రూట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చిగుళ్లు, దంతాల నుండి రక్తం కారకుండా అరికడుతుంది. అంతేకాకుండా వాటిని గట్టి పరుస్తుంది.
** నేరేడు డయాబెటిక్ రోగులకు వరమనె చెప్పాలి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
** కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. నేరేడు తినడం వల్ల జిగట విరేచనాలు కూడా దూరముతాయి.
0 Comments:
Post a Comment