IRCTC Punya Kshetra Yatra: ఐఆర్‌సీటీసీ కాశీ యాత్రకు బుకింగ్స్ ప్రారంభం... రూ.15 వేలకే 9 రోజుల టూర్
ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) పేరుతో ఇప్పటికే ఐదు సార్లు ఈ టూర్ విజయవంతంగా పూర్తైంది. తెలుగు రాష్ట్రాల పర్యాటకుల నుంచి ఈ ఆధ్యాత్మిక యాత్రకు మంచి స్పందన వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఆర్‌సీటీసీ టూరిజం దక్షిణ మధ్య రైల్వే మరో మూడు సార్లు ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. జూన్ 28, జూలై 12, జూలై 26 తేదీల్లో పుణ్య క్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు పుణ్య క్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఆర్‌సీటీసీ పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ ధర రూ.15 వేలు మాత్రమే. ఇది 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ. 9 రోజుల్లో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ చూడొచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మొదటి రోజు పర్యాటకులు కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం టూరిస్ట్ రైలు మాల్తీపాత్‌పూర్ చేరుకుంటుంది. పర్యాటకులు అక్కడ్నుంచి పూరీ బయల్దేరాలి. పూరీలో జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి పూరీలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మూడో రోజు పర్యాటకులు కోణార్క్ బయల్దేరాలి. కోణార్క్‌లో సూర్యదేవాలయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత గయ బయల్దేరాలి. నాలుగో రోజు పర్యాటకులు గయ చేరుకుంటారు. గయలో పిండప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాశీకి బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఐదో రోజు కాశీకి పర్యాటకులు చేరుకుంటారు. కాశీలో విశ్వనాథ ఆలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం సందర్శించవచ్చు. సాయంత్రం గంగా హారతి చూడొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం వారణాసి నుంచి అయోధ్య బయల్దేరాలి. అయోధ్య చేరుకున్న తర్వాత రామజన్మభూమి, హనుమాన్‌గఢి చూడొచ్చు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం
ఏడో రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగమం సందర్శించవచ్చు. హనుమాన్ మందిర్, శంకర్ విమాన్ మండపం చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు చేరుకుంటుంది. తొమ్మిదో రోజు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం
ఐఆర్‌సీటీసీ పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంటుంది. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.15,075. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.23,875. కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.31,260. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పర్యాటకులు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో ఐఆర్‌సీటీసీ పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ బుక్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Bharat Gaurav సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో పుణ్య క్షేత్ర యాత్ర వేర్వేరు తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసేముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment