Inspiration - ఫంక్షన్స్ లో చిన్నచూపు.. కసితో రూ.40 లక్షల ప్యాకేజీ సాధించిన యువతి.. వాళ్ల నోరు మూయించేలా...
మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అవమానాలు ఎదురు కావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని అవమానాలు మనస్సును బాధించే విధంగా ఉంటాయి. అలా అవమానాలను ఎదుర్కొని ప్రస్తుతం ఒక యువతి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు అంచెలంచెలుగా ఎదిగింది.
ఈ యువతి సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు సైతం షాకవుతున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి ఈ స్థాయిలో కష్టపడతారా అని కామెంట్లు చేస్తున్నారు.
బీటెక్ డిగ్రీ లేకపోయినా సాధారణ డిగ్రీతోనే మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించిన ఈ యువతి కథ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు( Manuguru )కు చెందిన భావన( Bhavana ) ప్రస్తుతం లండన్ బేస్డ్ అమెజాన్ కంపెనీలో 40 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నారు. భావన కుటుంబానికి కేవలం ఎకరం పొలం మాత్రమే ఉండేది.
ఈ కుటుంబాన్ని ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. ఎక్కడికి వెళ్లినా భావన కుటుంబాన్ని అందరూ చిన్నచూపు చూసేవారు. ఉన్నత ఉద్యోగం చేసిన తనపై విమర్శలు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని భావన భావించింది. చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివిన భావన ఆరో తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరింది. అత్తెసరు మార్కులతో పదో తరగతి పాస్ అయింది.
ఇంటర్ కోసం ఖమ్మంకు చేరుకున్న ఈ యువతి డిగ్రీ పూర్తి చేశాక పలు ఇంటర్వ్యూలకు హాజరు కాగా రిజెక్ట్ అయ్యారు. బీటెక్ చదవలేదంటూ పలు కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేదు. మూడో ప్రయత్నంలో మాత్రం అమెజాన్( Amazon ) లో భావన కొలువు సాధించారు. ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తనకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. భావన కెరీర్ పరంగా ఎదిగిన తీరుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బానాల భావన ఎదిగిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
0 Comments:
Post a Comment