Hair Fall - హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా.. అయితే కచ్చితంగా మీరు ఈ రెమెడీని ట్రై చేయాల్సిందే..
హెయిర్ ఫాల్( Hair fall ) అనేది సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి. అందరిలోనూ ఈ సమస్య ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది.
పైగా ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయలేకపోతుంటారు. నిజానికి జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవడం తో పాటు ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ హెయిర్ ప్యాక్( Protein hair pack ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న కప్పు పెసలు( moongdall ) వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేసుకోవాలి. ఆపై రెండు గ్లాసుల వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానబెట్టుకున్న పెసలను ఒక క్లాత్ లో మూట కట్టి ఒక రోజంతా వదిలేయాలి. దాంతో పెసలు మొలకెత్తుతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో మొలకెత్తిన పెసలను వేసుకోవాలి.అలాగే అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Fresh aloe vera gel ), మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ తో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒకే ఒక్కసారి ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది. కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి. అదే సమయంలో జుట్టు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.
0 Comments:
Post a Comment