Gold Rates: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తాజా రేట్లివే..
Gold Rates: వారం రోజులుగా పసిడి ధరల్లో పతనం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో వెండి రేట్లు సైతం తగ్గటం మెుదలు పెట్టాయి. అయితే ఈ వార్త ఇప్పుడు వారాంతంలో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి.
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.400 చొప్పున తగ్గింది. నేడు దేశంలోని వివిధ నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.54,450, ముంబైలో రూ.54,100, దిల్లీలో రూ.54,250, కలకత్తాలో రూ.54,100, బెంగళూరులో రూ.54,100, కేరళలో రూ.54,100, వడోదరలో రూ.54,150, జైపూర్ లో రూ.54,250, మధురైలో రూ.54,450, పాట్నాలో రూ.54,150, మంగళూరులో రూ.54,100, నాసిక్ లో రూ.54,130, గురుగ్రామ్ లో రూ.54,250గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,400, ముంబైలో రూ.59,020, దిల్లీలో రూ.59,170, కలకత్తాలో రూ.59,020, బెంగళూరులో రూ.59,020, కేరళలో రూ.59,020, వడోదరలో రూ.59,070, జైపూర్ లో రూ.59,170, మధురైలో
రూ.59,400, పాట్నాలో రూ.59,070, మంగళూరులో రూ.59,020, నాసిక్ లో రూ.59,050, గురుగ్రామ్ లో రూ.59,170గా కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరాలైన విజయవాడ, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, కడపలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,020గా ఉంది. ఇదే సమయంలో తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిన్న కేజీకి రూ.1000 తగ్గిన వెండి నేడు మరో రూ.500 తగ్గింది. దేశంలో కిలో ధర రూ.71,500 ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.74,000 వద్ద కొనసాగుతున్నాయి.
0 Comments:
Post a Comment