DEO డీఈవోపై 'స్పందన'లో ఫిర్యాదు
- టీచర్ల బదిలీల్లో అక్రమాలపై..
- న్యాయం చేయాలని డిమాండ్
అరసవల్లి, జూన్ 26: ఉపాధ్యాయ బదిలీల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు.
డీఈవో తిరుమల చైతన్య వైఖరిని నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పేడాడ ప్రభాకరరావు ఆధ్వర్యంలో డీఈవోపై ఫిర్యాదు చేశారు. 'ప్రధానంగా కలెక్టర్ ఆమోదించిన 12మంది మెడికల్ ప్రిఫరెన్షియల్ పరిగణించకపోవడం.
ఆరుగురు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు మాన్యువల్‌గా రీకౌన్సెలింగ్ నిర్వహించడం. 8 ఏళ్లు పూర్తికాకపోయినా కొందరు మహిళా ఉపాధ్యాయులకు స్పౌజ్ పాయింట్లు కేటాయించడం.. వంటి అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు.
దీనివల్ల మూడు వారాలు కావస్తున్నా, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు బదిలీ ఉత్తర్వులు పట్టుకుని ఏ పాఠశాలకు వెళ్లాలో తెలియక డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరే డీఈవోలో చైతన్యం లేదు. ముగ్గురు విద్యార్థులున్న పలాస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రెండవ పోస్టు కేటాయించారు. 1, 2 తరగతుల్లో 52 మంది ఉన్న గుప్పెడుపేటకు రెండవ పోస్టు కేటాయించలేదు.
ఇలా అస్తవ్యస్తంగా బదిలీ ప్రక్రియ సాగింది. సమస్య పరిష్కరించాలి' అని కోరుతూ ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. లేదంటే డీఈవో వైఖరిని నిరసిస్తూ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
0 Comments:
Post a Comment