Course: ప్లేస్‌మెంట్ తర్వాతే పేమెంట్ ..! ఆరు నెలల్లో కోర్సు పూర్తి! నెలకు లక్షల్లో జీతం!
ప్రస్తుత రియల్ వరల్డ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డేటా సైన్స్ ఒకటి. ఇన్‌ఫర్మేషన్ పవర్‌ఫుల్‌గా మారింది. కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోవడంలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది.
దీంతో డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ స్కిల్డ్ బేస్డ్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ 'అప్‌లిఫ్టర్స్' తాజాగా డేటా సైన్స్‌పై సర్టిఫికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. 'పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ ఆప్షన్'తో ఈ కోర్సును అప్‌లిఫ్టర్స్ అందిస్తోంది. కోర్సు వ్యవధి ఆరు నెలలు. గ్రాడ్యుయేట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్థికభారం లేకుండా డేటా సైన్స్‌లో కెరీర్ అవకాశాలను అందించడమే ఈ కోర్సు లక్ష్యమని ఎడ్‌టెక్ పేర్కొంది.
* ఫోకస్ చేసే టాపిక్స్ ఇవే
ఈ కోర్సును 30 వారాల పాటు ఆన్‌లైన్‌లో డెలివరీ చేయనున్నారు. ఈ కోర్సు ప్రధానంగా పైథాన్, డేటా సైన్స్ మ్యాథ్, డేటా సోర్సెస్, మెషిన్ లెర్నింగ్, DSA ఇన్ పైథాన్‌లో, ఎక్సెల్, SQL, పవర్ BI/టేబుల్, క్లౌడ్ బేసిక్స్, కంప్యూటర్ విజన్/ NLP వంటి అంశాలపై ఫోకస్ చేయనుంది. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌పై కూడా దృష్టిసారిస్తుంది. రియల్-వరల్డ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ క్లెయిమ్స్ ద్వారా అభ్యర్థులు ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.
* ప్రోగ్రామ్ ఫీజు రూ.40,000
అభ్యర్థుల కోసం డేటాసైన్స్ PAPను అప్‌లిఫ్టర్స్ డిజైన్ చేసింది. దీని ద్వారా అభ్యర్థులు స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. అయితే కొద్ది మొత్తం ఫీజును ముందస్తుగా చెల్లించాలి. మిగతా ఫీజును ప్లేస్‌మెంట్ తర్వాత చెల్లించవచ్చు. లెర్నర్స్ కోసం ముందస్తు ఫీజు చెల్లించి ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. PAP ప్రోగ్రామ్ ఫీజు రూ.40,000. కోర్సులో రిజిస్టర్ చేసుకునే ముందు రూ.20,000, మిగిలిన మొత్తాన్ని CTCలో 30% (గరిష్టంగా రూ. 2 లక్షల వరకు)గా ప్లేస్‌మెంట్ తర్వాత చెల్లించాల్సి ఉంటుంది.
* స్పెషల్- లైవ్ ఎంగేజింగ్ క్లాసులు, ప్రాజెక్ట్స్ అసైన్‌మెంట్స్
డేటా సైన్స్ కోర్సు కోసం ఎన్‌రోల్‌మెంట్ ఫీజు చెల్లించిన తరువాత స్పెషల్- లైవ్ ఎంగేజింగ్ క్లాసులు, ప్రాజెక్ట్స్ అసైన్‌మెంట్స్, Q&A సెషన్స్, వన్-టు-వన్ కౌన్సెలింగ్, ప్లేస్‌మెంట్ గైడ్ వంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. వీటికి అదనంగా అప్‌లిఫ్టర్స్ మాక్ ఇంటర్వ్యూలు, రెజ్యూమ్ బిల్డింగ్, ఇతర వర్క్‌షాప్‌లతో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.
* ప్లేస్‌మెంట్ అవకాశాలు
అప్‌లిఫ్టర్స్ వ్యవస్థాపకుడు, CEO ఉమంగ్ సంగల్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ఐడియల్ డేటా సైన్స్ కోర్సును ఎంచుకోవడం అనేది అభ్యాసకులకు సవాలుతో కూడుకున్నది. తగిన కోర్సు ఎంపికలో సమయం పడుతుంది. ఫీజు కూడా ఎక్కువగా ఉండవచ్చు. అయితే అది సంబంధిత ప్లేస్‌మెంట్ అవకాశంతో కనెక్ట్ అయి ఉండకపోవచ్చు. అయితే అప్‌లిఫ్టర్స్‌లో అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి PAP కోర్సులతో అభ్యర్థుల్లో స్కిల్స్ పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నాం.' అని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment