Coriander Leaves Health Benefits: సాధారణంగా మనం ప్రతి వంటకంలోనూ కొత్తిమీర ఉపయోగిస్తాం. చాలా మంది కొత్తిమీర ఆకులను గార్నిషింగ్ కోసం ఉపయోగిస్తారు, తాము చేసిన వంటకాన్ని కొత్తిమీరతో అలంకరిస్తారు.
అయితే అలంకరణ కోసమే కాదు, మీ ఆరోగ్యం కోసం కూడా కొత్తమీర ఆకులను చల్లుకోండి.
కొత్తిమీర ఆకులు విటమిన్ A, విటమిన్ C లకు అద్భుతమైన మూలం. అదనంగా డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి.
అంతే కాకుండా, మీ శరీర జీవక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఆకుపచ్చని కొత్తిమీర ఆకులను ఆహారంతో పాటు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
మెరుగైన కంటిచూపు
మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ కంటిచూపు మెరుగుపడాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోండి. కొత్తిమీర ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి, ఇవి మంచి దృష్టిని అందించడంలో సహాయపడతాయి.
క్రమం తప్పకుండా కొత్తిమీర తింటే వయస్సుతో పాటు వచ్చే రెటీనా సమస్యలు (ARMD) దూరం చేసుకోవచ్చు, కండ్లకలక మొదలైన కంటి సమస్యలు కూడా నయం అవుతాయని పలు అధ్యయనాలు ధృవీకరించాయి.
మధుమేహం అదుపులో
ఆకుపచ్చని కొత్తిమీర ఆకులలో యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి, ఇవి ఎంజైమ్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. తద్వారా, ఇది ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడవచ్చు.
భోజనంలో కొత్తిమీర కలుపుకోవడం లేదా కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వారికి మేలు జరుగుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు పోషకాలు మీ రోగనిరోధక శక్తిని క్రమంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి.
విటమిన్ సి తెల్ల రక్త కణాల పనితీరును పెంచుతుంది, రక్తంలో హీమోగ్లోబిన్ వృద్ధికి అవసరమయ్యే ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది.
జీర్ణసమస్యలు దూరం
కొత్తిమీర ఆకులలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగుల దుస్సంకోచాలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
కొత్తిమీర ఆకలిని నియంత్రించడంలో, కడుపు కదలికలను సరిచేయడంలో సహాయపడే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి, దీని కారణంగా ఉబ్బరం సమస్య ఉండదు.
చర్మాన్ని ఆరోగ్యాన్ని ఉంచుతుంది
కొత్తిమీరలోని పొషకాలు చర్మాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో సహాయపడతాయి. దీని ఆకుల్లో ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ ఎలు ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ , యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇది చర్మాన్ని శాంతపరచడానికి తోడ్పడుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
ధమనులను ఆరోగ్యంగా ఉంచవచ్చు. గుండె సమస్యలతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కొత్తిమీరను ఎలా ఉపయోగించాలి?
మీ ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో కొత్తిమీరను క్రమం తప్పకుండా చేర్చుకోవడం మంచిది. వీటిని వంటకాలలో చల్లుకొని తినండి.
లేదా కొత్తిమీరను రసం చేసి తీసుకోండి. రోజుకు ఒక గ్లాసు మజ్జిగలో 1 లేదా 2 టీస్పూన్ల కొత్తిమీర జ్యూస్‌ని కలపండి. పుష్కలంగా పోషకాలు లభిస్తాయి.
మీ చర్మ సంరక్షణ కోసం, కొత్తిమీర పేస్ట్ తయారు చేసి, మీ చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.
0 Comments:
Post a Comment