లొట్టలేసుకుంటూ చికెన్ లాగిస్తున్నారా.. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ వ్యాధి బారినపడొచ్చు, డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
మాంసాహారం అనగానే అందరికీ గుర్తొచ్చేది చికెనే. చిన్నారుల నుంచి పెద్దల వరకు చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగిస్తారు. హోటల్స్, రెస్టారెంట్స్‌లో పలు రకాల పేర్లతో చికెన్ వెరైటీస్ అందుబాటులో వున్నాయి.
కొంతమంది చికెన్ లేకుండా ముద్ద కూడా ఎత్తరంటే అతిశయోక్తి కాదు. అంతలా చికెన్‌కి బానిసలుగా మారిపోతున్నారు కొందరు. అయితే ఇది శ్రేయస్కరం కాదంటున్నాయి పలు పరిశోధనలు. అన్నింటికి మించి ఈ చికెన్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద వ్యాధికి మిమ్మల్ని బలిపశువును చేస్తుందట. ఇది చెప్పిందో సాధారణ వ్యక్తి కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). చికెన్ ''యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఏంఆర్) ''ను కలిగిస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఏఏంఆర్ అనేది ప్రపంచంలో పదవ అతిపెద్ద వ్యాధిగా జాబితాలోకి ఎక్కింది. దీనిపై ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఎం.వలి మాట్లాడుతూ.. చికెన్ తినడం వల్ల ప్రజలు అత్యంత వేగంగా ఏఎంఆర్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు.
కోళ్లకు పౌల్ట్రీలలో యాంటీబయాటిక్ :
చికెన్‌లో ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే మీకు ఓ ప్రశ్న తలెత్తొచ్చు.. చికెన్‌లో పోషకాలు వున్నప్పుడు, అవి మమ్మల్ని ఎలా అనారోగ్యానికి గురిచేస్తాయని.?. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుత రోజుల్లో చికెన్‌ను ఆరోగ్యంగా, తాజాగా ఉంచడానికి యాంటీబయాటిక్స్‌ను పౌల్ట్రీలలో ఇస్తున్నారు. దీని కారణంగా కోడి శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకుపోతుంది. ఇది చికెన్ తినేవారి శరీరంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. ఈ కోడిని తిన్నప్పుడు, చికెన్‌లోని యాంటీబయాటిక్ తినేవారి శరీరంలో పోగుపడుతుంది.
శరీరంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగితే:
ఈ విధమైన చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని చెడు ప్రభావం ఏంటో తెలుసా..? శరీరంపై యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గుతుంది. చికెన్ తిన్న తర్వాత శరీరంలోకి వచ్చే యాంటీబయోటిక్స్ కొంత సమయం తర్వాత యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)గా మారుతాయి. అలాంటి స్థితిలో శరీరం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు చికిత్స కష్టతరమైందే కాదు, అసాధ్యం కూడా.
శాకాహారమే విరుగుడు :
యాంటీబయాటిక్స్ శరీరంలో పేరుకుపోయే విధానం ఏఎంఆర్ సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో.. భోజనంలో శాఖాహారాన్ని తీసుకోవడం పెంచాలి. ఆకుపచ్చ కూరగాయలు, పనీర్, పాలు, పెరుగు ఉపయోగించాలి. ఇవి ప్రోటీన్‌లను శరీరానికి అందిస్తాయి.
0 Comments:
Post a Comment