Career In YOGA: యోగా రంగంలో కెరీర్.. ఉద్యోగాలకు తిరుగులేని దారి.. రూ.లక్షల్లో సంపాదన..
జూన్ 21 అని తేదీ చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది యోగా డే(Yoga Day). ప్రతి సంవత్సరం ఆ రోజు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి యోగాసనాలు వేస్తుంటారు.
యోగాలో ఏ మాత్రం అనుభవం లేని వాళ్లు కూడా ఆ రోజు కచ్చితంగా యోగాసనాలు మొదలు పెడతారు. అయితే.. యోగాను ప్రతీ రోజు వ్యాయామంగా చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీని ద్వారానే చాలా మంది యోగా శిక్షకుడిగా కెరీర్(Career) ప్రారంభించాలని అనుకుంటారు. యోగా అనేది మానవులందరికీ .. వారి శరీరానికి చాలా ముఖ్యమైనది. దీనిని ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా.. మన శరీరం అనేక వ్యాధుల నుండి బయటపడుతుంది. అంతే కాదు.. వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా వస్తుందని డాక్టర్స్(Doctors) చెబుతున్నారు.
అయితే.. మీరు ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. తర్వాత ఈ రంగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (యోగా), మాస్టర్ ఇన్ ఆర్ట్స్ (యోగా), పీజీ డిప్లొమా ఇన్ యోగా థెరపీ మొదలైన వివిధ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్
కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల వ్యవధి 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంటర్ లేదా డిగ్రీ తర్వాత కూడా మీరు వీటిని చేయవచ్చు.
ఉద్యోగాలు .. ">
మీరు యోగా రంగంలో గొప్ప కెరీర్ ప్రారంభించవచ్చు. విద్యార్థులు యోగా విద్యలో శిక్షణ పొందడం ద్వారా యోగా ఉపాధ్యాయులుగా మారవచ్చు. యోగాసనాలు, ప్రాణాయామం, మంత్ర చిత్తం, ధ్యానం మొదలైన వాటి అధ్యయనానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం ద్వారా వారు యోగా విద్యా సంస్థలు, ఆశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, యోగా స్టూడియోలు మొదలైన వాటిలో ఉద్యోగాలు పొందవచ్చు. అంతే కాకుండా.. యోగా థెరపీ అనేది వ్యాధులు, ఒత్తిడి, అంతర్గత సమస్యలు, బాధలు మొదలైన వాటిని నియంత్రించడానికి యోగాను ఉపయోగించే ఉన్నతమైన ఆరోగ్య సంరక్షణ. మీకు యోగా థెరపీ పట్ల ఆసక్తి ఉంటే.. సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్‌గా కెరీర్‌ను కొనసాగించవచ్చు.
జీతం ఎలా ఉంటుంది..
అభ్యర్థులు యోగా శిక్షకుడిగా మారడం ద్వారా యోగా స్టూడియోలు, వ్యాయామశాలలు, హెల్త్ క్లబ్‌లు మొదలైన వాటిలో పని చేయవచ్చు. ఈ రంగంలో డబ్బుకు కొరత ఉండదు. మొదట్లో అభ్యర్థికి నెలకు 20 వేల నుంచి 25 వేల రూపాయలు వస్తాయి. ఇంక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో మీరు జాబ్ సాధిస్తే.. మొదట్లోనే జీతం రూ.50వేలు ఉంటుంది. దీని తర్వాత అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నెలకు రూ.లక్షల్లో సంపాదించే యోగా శిక్షకులు ఉన్నారూ.
RESULTS(Link-1) | CLICK HERE![]() |
RESULTS(Link-2) | CLICK HERE![]() |
RESULTS(Link-3) | CLICK HERE![]() |
0 Comments:
Post a Comment