ప్రపంచ దేశాల్లో వణుకు.. అణు యుద్ధానికి అడుగులు ?
పుతిన్ నిర్ణయాలతో ప్రపంచంలో వణుకు మొదలైంది. ఇప్పటికే మొదలు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధానికి అంతు ఎన్నడనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఏర్పాడ్డాయి.
దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు రష్యా నుంచి సంచలన ప్రకటనలు వెలువడుతున్నాయి. బెలారస్‌కి అణు ఆయుధాలు వెళ్తున్నట్లు ఇప్పటికే రష్యా, బెలారస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు బెలారస్ కేరాఫ్ అడ్రస్‌గా అణు యుద్ధం తప్పదా.. ? అనే ప్రశ్నకు అవుననే సమాధానాలు వస్తున్నాయి!
అణుయుద్ధం విషయంలో పుతిన్ ఏమాత్రం ఆవేశపూరిత నిర్ణయం తీసుకున్నా సర్వనాశనమేనని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి! పుతిన్ నిర్ణయంతో ఇక ఉక్రెయిన్ కథ ముగిసే అవకాశాలు లేకపోలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఒక వేళ అణుయుద్ధంలోనూ ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తే.. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరిగినట్లే.. ఎందుకంటే ఓ వైపు రష్యా దాని మిత్ర దేశాలు, మరో వైపు ఉక్రెయిన్ మద్ధతు దేశాల మధ్య బీకర పోరు సాగే అవకాశం ఉంటుంది. అది ప్రపంచాన్ని ఎక్కడికైనా నెట్టి వేయగలదు.
అన్ని దేశాల్లో ఉన్న అణు బాంబులు ఉపయోగిస్తే మిగిలేది బూడిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వినాశనానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అయితే బెలరాస్ కేంద్రంగా అణు యుద్ధం తప్పేలా లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచం అంతా హిరోషిమా, నాగసాకిలో ఏర్పడిన పరిస్థితులే పునారావృతమవుతాయి. ఈ యుద్ధాన్ని ఆపే శక్తి ఎవరికి ఉందో ప్రపంచానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది!
0 Comments:
Post a Comment