ఈ ఒక్కటి చాలు ఎలాంటి బాన పొట్ట అయినా సరే దెబ్బకు మాయం అవుతుంది..
చాలా మంది తమ పొట్ట లావుగా ఉందని తెగ బాధపడుతూ ఉంటారు. బాన పొట్టను కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. పొట్ట పెరగడానికి కారణాలు అనేకం.
అలాగే పొట్టను తగ్గించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజు ఉదయం తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా సరే దెబ్బకు మాయం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.నైట్ నిద్రించే ముందు ఐదు బాదం పప్పులను ( Almonds ) వాటర్ లో వేసి నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క, ( Cinnamon ), మూడు లవంగాలు, రెండు దంచిన యాలకులు, ( Cardamom ) వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, అర అంగుళం దంచిన అల్లం ( Ginger )ముక్క, చిటికెడు కుంకుమపువ్వు, రెండు మిరియాలు వేసి మరిగించాలి.
కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు వాటర్ ను మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని అందులో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె తో పాటు నానబెట్టుకున్న బాదం పప్పును పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతే మన డ్రింక్ సిద్ధం అయినట్టే. రోజు ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతోంది. బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడటానికి ఈ డ్రింక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. వెయిట్ లాస్ అవుతారు. బాడీ డిటాక్స్ అవుతుంది. జలుబు. గొంతు నొప్పి. దగ్గు వంటి సమస్యలు ఉన్నా సరే తగ్గు ముఖం పడతాయి.
0 Comments:
Post a Comment