జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి డిస్కౌంట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం( AP Govt) భారీ శుభవార్త తెలిపింది. ఎలక్ట్రిక్ బైక్లను డిస్కౌంట్లతో( Discounts on electric bikes ) అందించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎలక్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆవేరాతో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ నెడ్క్యాప్ తాజాగా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రభుత్వం ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric vehicles for government employees ) కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు అవేరా సంస్థ ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఆంధ్రా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపడుతోంది.
గ్రీన్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ తో అందించేందుకు అవేరా సంస్థతో( Avera is a company ) రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అవేరా సంస్థ రెటోరోసా 2, టూ వీలర్లపై రూ.10 వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే రెటోరోసా లైట్ స్కూటర్పై రూ.5 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ కింద 7 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని టార్గెట్ పెట్టుకుంది.
అలాగే ఎలక్ట్రిక్ బైక్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం అందించే వేతనం నుంచి ఈఎంఐ పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. నెలకు రూ.2500 వరకు ఈఎంఐ రూపంలో ప్రభుత్వం అందించే జీతం నుంచి చెల్లించేలా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయాన్ని ఉద్యోగులు పొందాలంటే ముందుగా పేర్లను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఎలక్ట్రిక్ బైక్ లు వాడటం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందరూ వాడేలా ప్రోత్సహించేందుకు ఈ డిస్కౌంట్ అందిస్తోంది.అలాగే రాష్ట్రంలోని హైవేలు, ప్రభుత్వ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
0 Comments:
Post a Comment