Aspartame: కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్!.. ఈ విషయం తెలిస్తే ఇకపై తాగుతారో లేదో...
సమ్మర్ వచ్చిదంటే చాలు బాటిల్స్ మీద బాటిల్స్ డ్రింక్స్ తాగేస్తుంటారు కొందరు. బయట బాగా ఎండగా ఉందంటే చాలు కూల్ డ్రింక్ తాగుదాం అంటుంటాం! బిర్యానీతో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా...ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ.
ఇలా ఈ మధ్యకాలంలో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అయితే ఈ కూల్ డ్రింక్స్ మనకు తాత్కాలికంగా దాహర్తి తీర్చినా.. దీర్ఘకాలంలో మన జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. అయితే కూల్‌డ్రింక్‌లలో స్వీట్ కోసం కలిపే కృత్రిమ స్వీట్నర్‌లతో చాలా ప్రమాదం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇటీవల పరిశోధనల్లో ఈ విషయం తేలింది.
కృత్రిమ స్వీట్నర్‌లలో ఒకదానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్యాన్ చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కృత్రిమ స్వీట్నర్ యాస్పర్టెమ్‌ను వాడితే ప్రాణాంతకమని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోకా-కోలా సోడాల నుంచి మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్‌తో కొన్ని రకాల కూల్‌డ్రింక్స్‌లలో యాస్పెక్ట్రమ్ వాడతారు. జూలైలో యాస్పక్ట్రమ్‌ను క్యాన్సర్ కారకాల లిస్టులో చేర్చనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
జూన్ ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్‌సీ) కృత్రిమ స్వీట్నర్ యాస్పెక్ట్రమ్‌ను క్యాన్సర్ కారకాల లిస్ట్‌లో చేర్చింది. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో కమిటీ జేఈసీఎఫ్ఏ కూడా ఈ సంవత్సరమే జూన్ చివరి వారంలో సమావేశం నిర్వహించింది. జూలూ14న IARC ప్రకటించిన అదే రోజునే దాని ఫలితాలూ ప్రకటించనుంది.
0 Comments:
Post a Comment