APలో ముందస్తు ఎన్నికలు? సీఎం జగన్ ప్లాన్ అదేనా?.. ఏం జరుగుతోంది?
ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకముందే...
ఎన్నికలు జరిగేలా చేస్తే... అద్భుత విజయం సాధించవచ్చు అని 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిరూపించారు. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇదే వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. తెలంగాణతోపాటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలూ జరిగే ఛాన్స్ ఉంది. కానీ.. వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు జరగవు అని అంటున్నారు. (File Image credit - twitter - @ysjagan)
2014లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడే.. ఏపీకీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రధాని మోదీపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనీ.. ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనీ.. లోక్‌సభతోపాటే.. ఏపీకీ ఎన్నికలు జరిగితే.. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ప్రభావం... వైసీపీపై పడే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేకుండా.. ముందుగా జరిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. (image credit - twitter - @narendramodi)
జనసేన , టీడీపీ , వైఎస్సార్‌సీపీ, బీజేపీ, సోము వీర్రాజు, పవన్ కల్యాణ్, చంద్రబాబు, వైఎస్ జగన్" width="1600" height="1600" /> 2014లో కంటే.. ఇప్పుడు వైసీపీకి... బీజేపీ సమస్యగా ఉంది. పైగా... ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన-టీడీపీ కలుస్తున్నాయి. ఇలా ఈ 3 పార్టీలూ కలిసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసేందుకు పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. ఈ మూడు పార్టీలూ.. రోజురోజుకూ కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయనీ.. అందువల్ల వీటికి చెక్ పెట్టి.. ఇవి మరింతగా ప్రచారం చెయ్యకుండా.. త్వరగా ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అని వైసీపీ భావిస్తున్నట్లు తెలిసింది. (File Image)
ప్రస్తుతం వైసీపీకి సొంత క్యాడర్ నుంచే సమస్య ఉంది. జిల్లాల్లో ఎక్కడ చూసినా అంతా వాలంటీర్లదే రాజ్యం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. 2న్నర లక్షల మంది ఉన్న వాలంటీర్లు అంతా తామే అన్నట్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన, పథకాల అమలు, నిధుల పంపిణీ, వైసీపీ సభలకు ప్రజల్ని తరలించడం ఇలా అన్నీ వాలంటీర్లే చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ నీరసించిపోయింది. త్వరగా ఎన్నికలకు వెళ్లకపోతే.. ఈ అంశం కూడా పార్టీకి మైనస్ అవ్వగలదని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు తెలిసింది. (File Image)
ఇక ప్రజల్లో కూడా వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. పథకాలు పక్కాగా అమలవుతున్నాయి గానీ.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించట్లేదనే భావన ఉంది. పక్కనే ఉన్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఏపీ కనీసం రాజధాని ఏదో కూడా చెప్పుకునే పరిస్థితిలో లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2009లో టీడీపీకి ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజలు.. అనుకున్నంత అభివృద్ధి కనిపించకపోవడంతో... 2014లో వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు. ఐతే.. వైసీపీ కూడా ఈ విషయంలో మైనస్సే అయ్యిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. (File Image)
ఈ నెల 8న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. విశాఖకు వస్తున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న తిరుపతి వస్తున్నారు. ఇక.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు. మొన్న శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీలోని అమిత్ షా ఇంటికి వెళ్లి పొత్తులపై చర్చించారు. ఇలా ప్రతిపక్షాలు వేగంగా పావులు కదుపుతున్న వేళ.. పథకాలే తమను గెలిపిస్తాయని నమ్ముతున్న వైసీపీ... అదే సమయంలో త్వరగా ఎన్నికలకు వెళ్లి.. మరో ఐదేళ్లు పాలించాలనుకుంటోందని తెలిసింది. (File Image)
0 Comments:
Post a Comment