AP Rains: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదే.!
ఉక్కపోతతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు. ఏపీతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అటు విదర్భలోని కొన్ని భాగాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రదేశాలు..
జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని భాగాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం.. ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
————————————————–
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఒకట్రెండు చోట్ల వీచే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
———————–
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ:-
—————-
ఈరోజు, రేపు :-
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
0 Comments:
Post a Comment