Amazon : నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..20 లక్షల ఉద్యోగాలు..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి కసరత్తులు చేస్తుంది.. ఇండియాలో భారీగా ఉద్యోగాలను ఇచ్చేందుకు కీలక ప్రకటన చేసింది..ఈ ప్రకటన వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు.
భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్ సీఈవో యాండీ జస్సీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్‌లో 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, అలాగే భవిష్యత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ నేపథంలో 2023 మొత్తంగా 26 బిలియన్ డాలర్ల ను ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు.. ఈ మేరకు కొత్త కంపెనీలకు భరోసా కల్పిస్తామని, కొత్తగా ఉద్యోగాలను పెంచుతామని , అలాగే కొత్త ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామని, స్మాల్ బిజినెస్‌కలు మద్దతుగా ఉంటాయని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు.. అదే విధంగా ఇండియన్ స్టార్టప్స్, ఉపాధి కల్పన, ఎగుమతులను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ వంటి పలు అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. 2023 కల్లా 10 మిలియన్ స్మాల్ బిజినెస్‌లను డిజిటైజ్ చేయడం, 20 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చేందుకు సహకరిస్తామని అన్నారు..
ఇక ఈ విషయం పై ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు..యాండీ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటికే 12 లక్షల ఇండియన్ బిజినెస్‌లకు సపోర్ట్ గా నిలుస్తుంది.. అలాగే ఇండియాలో తయారావుతున్న కోట్ల ప్రొడక్టులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. చాలా వరకు పిన్ కోడ్స్‌కు సర్వీసులు అందుబాటులో ఉంచింది.. భవిష్యత్ లో మరిన్ని బిజినెస్ లను భారత్ లో మొదలు పెట్టనున్నట్లు ఆయా సంస్థ అధినేత చెప్పుకొచ్చారు..
0 Comments:
Post a Comment