40 ఏళ్లు దాటాయా.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి...
వయస్సుని బట్టి ఆహారం తీసుకుంటూ ఉండాలి. వయస్సు పెరిగేకొద్ది జీర్ణక్రియ( Digestion ) కూడా స్లో అవుతుంది. ఇలాంటి సమయాల్లో అన్ని పదార్థాలు తీసుకోలేరు.
ఒకవేళ తీసుకున్నా త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. వయస్సు పెరిగే కొద్ది శరీరం వేగంగా పనిచేయడం తగ్గుతూ ఉంటుంది. ఊపిరితిత్తులు, జీర్ణక్రియ వంటివి మందగించి సరిగ్గా పనిచేయవు. దీంతో వయస్సును బట్టి కూడా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారు ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వారి వయస్సుకు తగ్గట్లు ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర తీసుకునే బదులు 40 ఏళ్ల వయస్సు పైబడినవారు తేనె తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే 40 ఏళ్లు పైబడినవారు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు( Heart problems ) వస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ (Junk food ) తీసుకోకూడదు. ఎందుకంటే వాటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే సోయాబీన్, మొక్కజొన్న, పామాయిల్ వంటి ఆయిల్ కూడా వాడకూదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ ఆయిల్ వాడటం చాలా ప్రమాదకరమని, వేరుశనగ, ఆలివ్ ఆయిల్ లాంటివి వాడితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారం తీసుకోకూడదు. 40 ఏళ్లు దాటినవారు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల అనారోగ్యాల బారిన పడుకుండా ఉంటారు. అలాగే వీటి వల్ల యాక్టివ్ గా ఉంటారు.
0 Comments:
Post a Comment