Weather alert : మే 13 నుంచి నిప్పుల ఎండ..
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు బ్రేక్ పడింది. వాతావరణం మారిపోయి.. మళ్లీ ఎండలు, వేడి గాలులు మొదలయ్యాయి. మే 13 నుంచి పలు ప్రాంతాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ (IMD) తెలిపింది.
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో మే 13 నుంచి ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది . శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, విజయనగరం, తిరుపతి, తూర్పుగోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది.
ఎండ... వేడి గాలులు
తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల, కడపలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకా ఎండలు మండిపోతాయని.. ఈ నెల 13నాటికి 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు టచ్ అవుతుందని అంచనా వేశారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తాయంటున్నారు. . మొన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణంతో ఎంజాయ్ చేసిన జనాలు.. ఉన్నట్టుండి పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలకు పెరిగింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
0 Comments:
Post a Comment