Viral : చదివేది 6.. టెన్త్ లో 566 మార్కులు.. ఈ చిన్నారి తెలివికి హ్యాట్సాఫ్
ఒకటో తరగతి చదువుతుండగానే లక్ష్మి అనే చిన్నారి.. పాఠశాలలో నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలు రాసింది.
ఎవరి సపోర్టు తీసుకోకుండానే లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు పరీక్షల్లో ఒక గోల్డ్, రెండు కాంస్య పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఒకటో తరగతి చదువుతూ రెండో తరగతి విద్యార్థులకు గణితంలో సందేహాలు తీర్చేది. ఈ విషయాన్ని లక్ష్మి తల్లి గుర్తించి ప్రోత్సహించారు. ఆమెకు మ్యాథ్స్ సబ్జెక్టుపై ఉన్న ఆసక్తిని గమనించి.. ఎక్కాలు నేర్పిస్తుండగా టకాటకా చేప్పేస్తుండడంతో తల్లి ఆశ్చర్యపోయేవారు. ఐదేళ్ల వయస్సులోనే పది రోజుల్లో పది ఎక్కాలు తప్పులేకుండా అప్పజెప్పేసింది లక్ష్మి. క్రమంగా వర్గాలు, ఘనాలు నేర్పించారు. అలా విద్యార్థిని ఎక్కడ చదివినా అంతే ప్రతిభతో అనేక పతకాలు సాధించింది.
ప్రస్తుతం లక్ష్మీ వయసు 11 సంవత్సరాల 8 నెలలు. గుంటూరు (Guntur) నగరంలోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నుంచి ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసింది. అమ్మాయి ప్రతిభను గుర్తించిన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో పది పరీక్షలు రాయగా.. అందులో అత్యధిక మార్కులు తెచ్చుకుంది. చిన్న వయసులోనే.. చిర్రా అనఘా లక్ష్మి అన్ని సబ్జెక్టులలో 90కి పైన మార్కులు సాధించి మొత్తం 600లకు 566 మార్కులు సాధించి.. అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ బాలిక 10 సంవత్సరాల వయసులో గణితంలో శతావధానం చేసిందని, అన్ని సబ్జెక్టులలో చక్కటి ప్రతిభను చూపించి స్కూల్ లో 2వ రాంక్ సాధించిందని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాము తెలిపారు.
చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభ... '995తో 992 గుణిస్తే ఎంత..?', '2012 సంవత్సరంలో మంగళవారాలు ప్రతి నెలా ఏయే తేదీల్లో వస్తాయి..?' అనే ప్రశ్నలకు పేపర్ మీద పెన్ను పెట్టకుండా, సమయం తీసుకోకుండా, క్యాలెండర్ లేకుండా లక్ష్మీ సమాధానాలు చెప్పేస్తుంది. అలాగే వెయ్యి గుణింతాల వరకు ఎక్కడ ఏమడిగినా చెప్పగలదు. అదేవిధంగా అడిగిన సంఖ్యలకు వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలు వెంటనే చెప్పేస్తుంది. పదేళ్ల వయసుకే ఇవన్నే నేర్చేసుకుంది చిన్నారి అనఘా లక్ష్మి.
చిత్తూరు జిల్లాకు చెందిన అనఘా లక్ష్మి... చేతిలో పెన్నూ పేపరు, క్యాలిక్యులేటర్ వంటి ఎటువంటి ఆధారం లేకుండా వేసిన ప్రతి లెక్కకూ అడిగిన వెంటనే సమాధానాలు చెప్తూ పండితుల చేత శెభాష్ అనిపించుకుంటోంది. వందమంది వరుసగా కూర్చొని గణితంలో వారు వేసే ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా శతావధానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రతిభతో ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. లక్ష్మి తండ్రి చిర్రా విష్ణు వర్ధన రెడ్డి, మాజీ నావికాదళ సభ్యుడు. ప్రస్తుతం ఎస్‌బిఐలో పనిచేస్తున్నారు. తల్లి సత్యశ్రీ, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ట్రయినర్ సత్యాదేవి. వీరి రెండో సంతానం లక్ష్మి. వీరి కుటుంబం మొదట్లో విశాఖపట్నంలో ఉండేది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా చిత్తూరుకు, ఇటీవల గుంటూరుకు మారింది. లక్ష్మికి చిన్నప్పటి నుంచి లెక్కలన్నా, ఆంకెలతో కూడిన పజిల్స్ అన్నా చాలా ఇష్టం.
ఏడు సంవత్సరాల వయసులోనే కళ్లకు గంతలు కట్టుకుని 100 వరకు గుణింతాలు ఎక్కాలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలకు సమాధానాలు చెప్పి ఏడేళ్ల వయసులోనే రికార్డు సఅష్టించింది ఈ చిన్నారి. విద్యార్థులకు, ముఖ్యంగా గణితం పట్ల ఆసక్తి కలిగిన వారిలో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవీ పేరు తెలీని వారుండరు. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న లక్ష్మి పదేళ్ల వయస్సులోనే అవధానాలు చేస్తోంది.లక్ష్మి కుటుంబం చిత్తూరుకు మారిన తర్వాత, అక్కడ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ప్రయత్నించారు. మొదటి ప్రయత్నంలోనే రికార్డు సాధించింది. ఆ తర్వాత తల్లిదండ్రులు వార్తా పత్రికల ద్వారా గణిత అవధానం గురించి తెలుసుకున్నారు. ప్రముఖ గణితావధాని అరుణ్ శివ ప్రసాద్ గురించి తెలుసుకొని, తమ కూతురిని ఆయన వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మి ప్రతిభను స్వయంగా చూసిన శివప్రసాద్ చిన్నారిని అవధానం వైపు ప్రోత్సహించారు.
అవార్డుల పరంపరఏడేళ్ల వయస్సులో ''ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్'' వారు రాండమ్‌గా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి అవార్డును సొంతం చేసుకుంది. 2019, డిసెంబర్‌లో బ్యాంకాక్‌లో నిర్వహించిన మొదటి ఏషియన్ యోగా ఛాంపియన్‌షిప్‌లో తన అన్నయ్య గోల్డ్ మెడల్ సాధించాడని, అన్నయ్యకు పోటీగా తొమ్మిదేళ్ల వయసులో 'నోబుల్ వరల్డ్ రికార్డ్స్'లో రికార్డు సృష్టించింది. నాగార్జున యూనివర్సిటీవారు నిర్వహించిన దశావధానంలో విశేష ప్రతిభను చూపి అవార్డు, వారి సత్కారాన్ని, కలెక్టర్ ప్రశంసలు అందుకుంది.
అరుణ్ శివప్రసాద్ సాయంతో అవధానంగణితంపై లక్ష్మికి గల ఆసక్తిని, చురుకుదనాన్ని గమనించిన గణితావధాని, జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులు అరుణ్ శివప్రసాద్ చిన్నారికి అవధానాన్ని పరిచయం చేశారు. కరోనా ప్రతికూల సమయంలో మొట్టమొదటిసారి, ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ వేదికగా 'బాల గణిత దశావధానా'న్ని 2020, జూన్ 26న నిర్వహించారు. ఆ కార్యక్రమంలో లక్ష్మి తన ప్రతిభతో ఎందరో గణిత శాస్త్ర మేధావులను అబ్బురపరిచింది. చిన్నారిలోని నైపుణ్యానికి ముగ్దుడైన అరుణ్ శివప్రసాద్ శతావధానానికి ప్రోత్సహించి మార్గ నిర్దేశం చేశారు.
చిత్తూరు వేదికగా గణిత శతావధానంబాలల దినోత్సవం సందర్భంగా 2021, నవంబర్ 13, 14 తేదీల్లో జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరులో గణిత శతావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెయ్యి గుణింతాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, క్యాలెండర్‌లో వారాలకు సంబంధించి 108 మంది గణిత పృచ్ఛకులు సంధించిన 108 ప్రశ్నలకు చిన్నారి లక్ష్మి చిచ్చర పిడుగులా సమాధానాలు చెప్పి అందరినీ అలరించింది. ఎంత క్లిష్టమైన ప్రశ్న వేసినా, టక్కున సమాధానం చెప్పిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గణిత శాస్త్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి పది సంవత్సరాల చిన్నారి గణిత శతావధానం చేయడం, అందుకు చిత్తూరు వేదిక కావడం, జిల్లాకే గర్వ కారణమని గణిత మేధావులంతా కొనియాడారు.
0 Comments:
Post a Comment