ఇటీవల యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ రావడం తెలిసిందే.
ఈ ఫలితాల్లో ఆ రాష్ట్ర అభ్యర్థులు ఆయేషా ఫాతిమా (23), ఆయేషా మక్రాని (26) ఇద్దరూ కూడా 184వ ర్యాంకు సాధించారు.
వీరిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటవ్వడంతో ఇక్కడే గందరగోళం ఏర్పడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ వాళ్లిద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు.
అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. అయితే వారిద్దరి అడ్మిట్ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది.
వీళ్లిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు.
అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా ఫాతిమా కార్డులో మంగళవారం అని ఉంది. వాస్తవానికి క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే.
అలాగే ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతోపాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. కానీ మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు.
దీంతో యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమానే అసలు అభ్యర్థి అని తేల్చేశారు. అలాగే మక్రానీపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment