Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..
అమ్మాయిలకు అందం మీద కాస్త దృష్టి ఎక్కువ.. ముఖం చందమామలా కనిపించాలని చాలా టిప్స్ ఫాలో అవుతారు. అయితే చాలామంది అమ్మాయిలకు అతిపెద్ద శత్రువు అవాంచిత రోమాలు(unwanted hair).
పై పెదవి పైభాగంలో(top of upper lip), గడ్డం(chin) భాగంలో వెంట్రుకలు పెరిగి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. వీటిని తొలగించుకోవడానికి అమ్మాయిలు ఎక్కువగా థ్రెడింగ్(threading), వ్యాక్సింగ్(waxing) మీద ఆధారపడతారు. ఇవి నొప్పితో కూడుకున్నవి అయినా తప్పదు కాబట్టి చచ్చినట్టు ఏదో ఒకటి ఫాలో అవుతుంటారు. అయితే ఈ అవాంఛిత రోమాలు ఇంట్లోనే చాలా(unwanted remove home tips) సులువుగా తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాదు, మళ్ళీ తిరిగి రావు కూడా.. ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
అమ్మాయిలు అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే వీటి వల్ల అవాంఛిత రోమాలు రెట్టింపు వేగంతో పెరుగుతాయి. ఒక చిన్న కప్ లో రెండు టేబుల్ స్పూన్ల పాలు(2tsp milk) తీసుకోవాలి, ఇందులో చిటికెడు పటిక పొడి(Alum powder) కలపాలి. ఇందులోకి రెండు స్పూన్ల బేకింగ్ సోడా(2tsp baking soda) వేసి పేస్ట్ లాగా కలపాలి. దీన్ని ముఖం మీద అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతంలో పట్టించి 15 నుండి 20నిమిషాల(15 to 20 minutes) పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత సాధారణ నీటితో ముఖం కడిగేయాలి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పేస్ట్ వెంట్రుకల పెరుగుదలను అరికడుతుంది.
ముఖం మీద అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి అమ్మాయిలు వ్యాక్సింగ్, థ్రెడింగ్ తరువాత పాలో అయ్యే పద్దతి షేవింగ్(shaving) చెయ్యడం. షేవింగ్ ఆరోగ్యకరమైనదే అయినా అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించదు. అయితే షేవింగ్ చెయ్యడానికి ముందు అలోవెరా జెల్(aloe vera gel) ముఖానికి అప్లై చేసి ఆ తరువాత పేషియల్ రేజర్(facial razor) తో ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకోవాలి. ఈ పద్దతిలో అవాంఛిత రోమాలు తొలగించుకుని పైన చెప్పుకున్న పటిక, బేకింగ్ సోడా టిప్ ఫాలో అయితే ముఖం మీద అవాంఛిత రోమాలు రావడం ఆగిపోతాయి.
0 Comments:
Post a Comment