Tyre Codes టైర్లు కొనేటప్పుడు వీటిని కచ్చితంగా తెలుసుకోవాలి.. టైర్లపై ప్రింట్ చేసిన కోడ్స్ వివరాలు మీ కోసం..
టైర్లు అనేవి వాహనాలకు చాలా కీలకం. ఇవి లేకుండా వాహనాలు నడవడం అసాధ్యం. మనం నిలబడాలి అంటే కాళ్లు ఎంత అవసరమో వాహనాలకు టైర్లు కూడా అంతే ముఖ్యం.
టైర్లు సరిగ్గా ఉంటేనే వాహనంలో ఎంత దూరమైన హాయిగా ప్రయాణించవచ్చు. టైర్లు వాహనంలో చాలా కీలకం..
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల టైర్ల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. అయితే టైర్లపై చాలా కోడ్‌లు ఉంటాయి. ఉదాహరణకు దానిపై ముద్రించే అక్షరాలు టైర్ వ్యాలిడిటీ, పొడవు, వెడల్పుతో పాటు కీలకమైన తదితర అంశాలను కలిగి ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోకుండా వినియోగదారులు నాసిరకం టైర్లను కొనుగోలు చేసి మోసపోతున్నారు.
టైర్లపై ముద్రించే అక్షరాలు భిన్నంగా ఉంటాయి. దాని ఆధారంగా టైర్లను కొనుగోలు చేయాలి. అప్పుడు మీ టైర్ మంచి టైర్ ని ఎంపిక చేసుకున్నట్లు అవుతుంది. వాహనంలో ప్రయాణించేటప్పుడు టైర్ల పాత్ర కీలకం కాబట్టి ఈ విషయంలో అలసత్వం వహించవద్దు. మంచి కంపెనీని ఎంచుకోవడంతో పాటు దానికి సంబంధించిన సైన్స్ విషయాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్లకు సంబంధించిన మీకు తెలియని కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేయనున్నాం.
మీరు కొనుగోలు చేసే ప్రతి టైర్‌పై కనిపించే కొన్ని అక్షరాలను చూసే ఉంటారు. ముఖ్యంగా పెద్ద అక్షరాలతో బ్రాండ్ పేరును ప్రమోట్ చేస్తాయి. అనంతరం టైర్ కి సంబంధించిన సమాచారం మీరు చూడవచ్చు. టైర్ సైడ్‌వాల్ లో ఆ టైర్ పూర్తి వివరాలు ఉంటాయి. వాటిలో కొన్ని మీకు అవసరమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి. మీరు ఈ రహస్య సమాచారాన్ని అర్థం చేసుకుంటే, టైర్లు కొనుగోలు చేసేముందు ప్రతిదీ తెలుసుకుంటారు.
టైర్ ఎంత లోడ్ మోయగలదు, దాని పరిమాణం, వయస్సు, స్పీడ్ రేటింగ్ వంటి కీలకమైన అంశాలను సైడ్ లో గమనించవచ్చు. మీరు కొత్త టైర్లను కొనుగోలు చేసినప్పుడు, మీ కారు అవసరాలకు అనుగుణంగా టైర్లు తయారు చేయబడి ఉంటే వీటిని సులభంగా తెలుసుకోవచ్చు. కాబట్టి టైర్‌పై ఉన్న అక్షరాల అర్థాలను వివరంగా తెలుసుకుందాం.
చిన్న ట్రక్ లేదా ప్యాసింజర్: మీరు కొనుగోలు చేసే టైర్ సైడ్‌వాల్‌లో (టైర్ వైపు) ఓ కోడింగ్ ని చూడవచ్చు. ఇది P లేదా LT అక్షరాలతో ప్రారంభమవుతుంది. P అంటే మెట్రిక్ లేదా ప్యాసింజర్ అని అర్థం. Pతో మొదలయ్యే అక్షరాలతో టైర్లు ప్యాసింజర్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించబడతాయని దీని అర్థం.
LT అంటే 'లైట్ ట్రక్' అని అర్థం. ఉదాహరణకు, టైర్‌లో P215/65R15 అనే అక్షరాలు ఉన్నాయని అనుకుందాం, P టైర్ ప్యాసింజర్ వాహనాలకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంది. P ప్రారంభమయ్యే టైర్లు కేవలం ప్రజలను తీసుకువెళ్ళే వాహనాల కోసం మాత్రమే రూపొందించబడ్డాయని గమనించాలి. చాలా బరువైన వస్తువులను తీసుకెళ్ళే ట్రక్కులకు ఈ టైర్లను ఉపయోగించకూడదు.
సైడ్‌వాల్ వెడల్పు (టైర్ వెడల్పు): P మరియు LT అక్షరాల తర్వాత సైడ్‌వాల్‌పై టైర్ కొలతలు మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు P215/65R15లో P తర్వాత మొదటి 3 అంకెలు టైర్ సైడ్‌వాల్‌ల వెడల్పును సూచిస్తాయి. వెడల్పు సాధారణంగా మిల్లీమీటర్లలో ఇవ్వబడుతుంది. P215/65R15 అంటే టైర్ సైడ్‌వాల్ 215 mm వెడల్పు ఉందని అర్థం.
ప్రొఫైల్ లేదా సైడ్‌వాల్ ఎత్తు: సైడ్‌వాల్ ఎత్తు అనగా కింద నుంచి టైర్ రిమ్ వరకు కొలుస్తారు. ఇది టైర్ సైడ్‌వాల్‌పై సైడ్‌వాల్ వెడల్పు శాతంగా సూచించబడుతుంది. అంటే P215/65R15 కోడ్ ఉన్న టైర్ 65% ఎత్తు ఉన్నట్లు అర్థం అంటే దీని ఎత్తు 215mm, వెడల్పు చూసుకుంటే 139.75mm ఉంటుదని గమనించాలి.
టైర్ నిర్మాణం: టైర్ ఎలా నిర్మించబడుతుందో R, B లేదా D ద్వారా సూచించబడుతుంది. ఇక్కడ, P215/65R15 R అని మనం చూడవచ్చు R అంటే రేడియల్ అంటే రేడియల్-ప్లై టైర్‌లో ప్లైస్ క్షితిజ సమాంతరంగా అమర్చబడి ఉంటాయి. టైర్ భ్రమణ దిశకు లంబంగా థ్రెడ్లు వేయబడతాయి.
మనం చూసే చాలా టైర్లు రేడియల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. రేడియల్-ప్లై టైర్లు మెరుగైన డ్రైవ్ నాణ్యత మరియు అధిక మైలేజీకి దోహదం చేస్తాయి. అంతేకాకుండా, రేడియల్ టైర్లు ఎక్కువ కాలం లైఫ్ టైమ్ ని అందిస్తాయి. ఇలా మీరు టైర్ కొనేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు మరిన్నీ కోడ్ లు అందుబాటులో ఉన్నాయి.
టైర్ తయారు చేయబడిన సంవత్సరాన్ని కూడా సులభంగా గుర్తించవచ్చు. మీరు కొనే టైర్ పై 35/19 అని ఉందనుకోండి. 2019 సంవత్సరంలో 35 వారంలో దీనిని తయారు చేసినట్లు గుర్తు. దీని వ్యాలిడిటీ బయట ప్యాక్ పై గుర్తించవచ్చు. అలానే ప్రెషర్ లోడ్, ట్రాక్షన్ కోడ్, టెంపరేచర్ కోడ్, ప్రెషర్ మార్కింగ్, మాక్సిమమ్ లోడ్ వంటి విషయాలు అందులో ఉంటాయి.
0 Comments:
Post a Comment