TVS iQube: జస్ట్ రూ.80తో నెలంతా తిరగొచ్చు.. బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్!
iQube Price | పెట్రోల్ ధరలతో విసుగెత్తిపోయారా?
అందుకనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇంకా ఇప్పుడు మంచి మోడల్ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెన టీవీఎస్ మోటార్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. దీని పేరు ఐక్యూబ్. మీరు ఈ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటు ధరకే కొనొచ్చు.
ఈ టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ అనే వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ విషయానికి వస్తే.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 145 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 82 కిలోమీటర్లు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ విషయానికి వస్తే.. 4 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.2 సెకన్లలోనే అందుకుంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్మార్ట్ ఎల్ఈడీ హెడ్‌లైట్ విత్ డీఆర్‌ఎల్, హెచ్ఎంఐ కంట్రోలర్, క్యారీ అలాంగ్ చార్జర్, 32 లీటర్ స్టోరేజ్, 17.78 సెంటీమీటర్ల మల్టీ ఫంక్షనల్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే యాప్ ఉంటుంది. దీని ద్వారా మీరు స్కూటర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ. 1.2 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. స్కూటర్ అసలు ధర రూ. 1.71 లక్షలు. అయితే మీకు ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ. 51 వేల డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 3 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఏడాది రోడ్ అసిస్టెంట్ లభిస్తుంది.
జూన్ నెల నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను తగ్గించడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడే కొంటే బెస్ట్.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంది. రోజుకు రూ.3 ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. యూనిట్‌కు రూ. 5 ఖర్చు పరంగా చూస్తే ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేయడానికి రూ.18.75 ఖర్చు అవుతుందని తెలిపింది.
ఈ లెక్కన చూస్తే.. రోజుకు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. నెలకు 600 కి.మి జర్నీ చేయాల్సి ఉంటుంది. దీనికి దాదాపు రూ.80 ఖర్చు అవుతుంది. 4 సార్లు ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment